Russia Vaccine: రష్యా వ్యాక్సిన్ బాగా పనిచేస్తుందట... నో సైడ్ ఎఫెక్ట్స్

అయితే, మనుషుల్లో కరోనా వైరస్‌ను అరికట్టడానికి ‘రష్యా స్పుత్నిక్ వి’, ఎపివాక్ అనే రెండు వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తుంది.

news18-telugu
Updated: October 22, 2020, 3:59 PM IST
Russia Vaccine: రష్యా వ్యాక్సిన్ బాగా పనిచేస్తుందట... నో సైడ్ ఎఫెక్ట్స్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రపంచానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు అన్ని దేశాలు వ్యాక్సిన్ రూపొందించే పనిలో పడ్డాయి. అయితే, అన్ని దేశాల్లోకెల్లా కరోనా వ్యాక్సిన్ రూపొందించడంలో రష్యా ఒక అడుగు ముందుంది. మహమ్మారిని అరికట్టడానికి రష్యా అనేక క్లినికల్ ట్రయల్స్ జరుపుతుంది. ఇప్పటికే మనుషుల కోసం రెండు వాక్సిన్లను ఉత్పత్తి చేస్తుండగా, జంతువుల కోసం ప్రత్యేకంగా మరో వాక్సిన్‌ను తయారు చేస్తుంది. దీనిలో భాగంగా జంతువుల కోసం అభివృద్ధి చేసిన కరోనా వాక్సిన్‌ను వాటిపై పరీక్షించగా కొన్ని సానుకూల సంకేతాలు వచ్చాయని పరిశోధనలు పేర్కొన్నాయి. జంతువుల కోసం రష్యా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ టెస్టింగ్లో భాగంగా ఎటువంటి దుష్ప్రభావాలను చూపించలేదని రష్యన్ ఫెడరల్ వెటర్నరీ అండ్ ఫైటోసానిటరీ వాచ్డాగ్ రోసెల్ఖోజ్నాడ్జోర్ యొక్క వెటర్నరీ అండ్ లైఫ్ జర్నల్ పేర్కొంది. కోవిడ్19 వైరస్‌కు గురయ్యే జంతువుల కోసం రూపొందించిన ఈ వ్యాక్సిన్‌ను పిల్లులు, కుక్కలు వంటి వాటిపై ప్రయోగిస్తే దాని ప్రభావాలు ఎలా ఉంటాయనే దానిపై అధ్యయనం జరుగుతోంది.

రోగనిరోధక శక్తి పెంచడానికి బూస్టర్ షాట్

రష్యా ఇటీవలే మనుషులతో పాటు జంతువులకు కూడా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసే పనిలో పడింది. దీనిపై అధ్యయనం చేస్తున్న రష్యన్ ఫెడరల్ సెంటర్ ఫర్ యానిమల్ హెల్త్ రిసెర్చ్ అండ్ మానిటరింగ్ డిప్యూటీ డైరెక్టర్ ఇలియా చ్యాలా మాట్లాడుతూ, “జంతువుల కోసం కోవిడ్–19 వ్యాక్సిన్ రూపొందించడంలో భాగంగా జరిపిన క్లినికల్ ట్రయల్స్‌లో ఎటువంటి దుష్ప్రభావాలు లేదా సమస్యలు గుర్తించలేదని మా 70 రోజుల పరిశీలనలో తేలింది. వాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా జంతువులకు మొదటి డోస్ ఇచ్చిన 21 రోజులలోపు బూస్టర్ షాట్ ఇస్తారు. ఎందుకంటే, ఇది వాటి శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచడంలో సహాయపడుతుంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో పెంపుడు జంతువులకు సైతం కరోనావైరస్ సోకినట్లు అనేక నివేదికలు స్పష్టం చేస్తున్నందున పెంపుడు పిల్లులు, కుక్కలపై కూడా క్లినికల్ ట్రయల్స్ జరుపుతున్నాం’ అని ఆయన అన్నారు.

అయితే, మనుషుల్లో కరోనా వైరస్‌ను అరికట్టడానికి ‘రష్యా స్పుత్నిక్ వి’, ఎపివాక్ అనే రెండు వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తుంది. ‘స్పుత్నిక్ వి’ వాక్సిన్ ఉత్పత్తికి రష్యా ఆగస్టులో నమోదు చేసుకోగా, ‘ఎపివాక్ కొరోనా’ వాక్సిన్ ఉత్పత్తిని అక్టోబర్ ప్రారంభించింది. వాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ అయ్యాక మొదట దేశంలోని ప్రజలకు వాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాకే బయటి దేశాల వారికి అందిస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 22, 2020, 3:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading