దేశంలో బూస్టర్ డోస్ అంశంపై ఢిల్లి హైకోర్టు (Delhi High Court) లో పిటిషన్ దాఖలైంది. ఈ అంశపై కేంద్రాన్ని కోర్టు వివరణ కోరగా బూస్టర్ డోస్ ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకోవడానికి మరింత సమయం పడుతుందని కేంద్రం కోర్టుకు వెల్లడించింది. దేశంలో బూస్టర్ డోస్ ఆవశ్యకతపై శాస్త్రీయ ఆధారాలు సేకరించేందుకు కేంద్రం పరిశీలిస్తుందని కేంద్రం వెల్లడించింది. పలు దేశాల్లో బూస్టర్ డోస్ అందిస్తున్న నేపథ్యంలో భారత్‌లో బూస్టర్ డోస్ పరిస్థితులు, ఆవశ్యకతను వివరించాలని ఢిల్లి హైకోర్టు కేంద్రాన్ని కోరింది. దీనిపై కేంద్రం స్పందించ వివరణ ఇచ్చింది. నేషనల్ టెక్ని కల్ అడ్వై జరీ గ్రూప్ ఆఫ్ ఇమ్యు నైజేషన్ (National Technical Advisory Group on Immunization), నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఆన్ వ్యా క్సిన్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ కొవిడ్-19 (National Expert Group on Vaccine Administration for COVID-19) శాస్త్రీయ ఆధారాలను సేకరిస్తున్నాయని కేంద్రం వివరించింది. బూస్టర్ డోసు పంపిణీపై నిర్ణయం తీసుకునేం దుకు సమయం పడుతుందని కేంద్రం వివరణ ఇచ్చింది.
టీకా తీసుకుంటే శరీరం పొందే రోగనిరోధక శక్తి ఎంత కాలం ఉంటుందనే అంశంపై ప్రస్తుతానికి స్ప ష్టత లేదని కేంద్రం పేర్కొంది. మెరుగైన సమాచారం కోసం కొద్ది రోజులు వేచి చూడాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ప్రస్తుతం ప్రభుత్వం అందరికీ టీకాలు అందించే అంశంపై దృష్టి సారించిందని పేర్కొంది. అర్హులందరికీ రెండో డోస్ అందించిన తర్వాత మూడో డోస్‌పై స్పష్టత వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.
ఒమిక్రాన్ లక్షణాలు.. ప్రభావం
- ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ సోకిన వారికి నిర్దిష్ట లక్షణాలంటూ ప్రత్యేకంగా లేవు.
- డెల్టా వలె, ఓమిక్రాన్ సోకిన వారిలో కొందరిలో లక్షణాలు బయటపడడం లేదు.
- వేరియంట్ సోకినవారికి కండరాల నొప్పితో పాటు 1-2 రోజులు అలసిపోయినట్లు అనిపిస్తుంది.
- గొంతు నొప్పి, తలనొప్పి మరియు ఛాతీ నొప్పి ఉన్నట్టు వైద్యులు గుర్తించారు.
- ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారికి తలనొప్పి, శరీరంలో నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
- వ్యాక్సిన్ తీసుకోని వారు ఎక్కువగా ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడుతున్నారు.
వ్యాక్సిన్లు వ్యాప్తిని తగ్గిస్తాయి: డబ్ల్యూహెచ్ఓ
ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ (Omicron) కేసులు కలకలం రేపుతున్నాయి. నెమ్మదిగా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. దీంతో ఆయా దేశాల ప్రభుత్వాలు ఆంక్షలు పెంచుతున్నాయి. అమెరికాలో ఒమిక్రాన్కేసులు బాగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ వ్యాక్సిన్లపై డబ్ల్యూహెచ్ఓ (WHO) ఆగ్నే యాసియా రీజినల్ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్లు వైరస్ సోకే అవకాశాలను తగ్గిస్తాయే తప్ప పూర్తిగా అడ్డుకుంటాయని అనుకోవద్దని అన్నారు. ప్రస్తుతం అందరికీ వ్యాక్సిన్ (Vaccines)లు అందించడంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona Vaccine, Covid vaccine, Delhi High Court, Omicron, Omicron corona variant