Covid-19 Vaccination : బూస్ట‌ర్ డోస్‌కు స్విట్జ‌ర్‌ల్యాండ్ అనుమ‌తి.. ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి

ప్రతీకాత్మక చిత్రం

Covid-19 Vaccination : స్విట్జ‌ర్లాండ్ (Switzerland)  ప్ర‌భుత్వం కోవిడ్ 19 (COVID-19) బూస్ట‌ర్ డోస్‌కు అనుమ‌తి ఇచ్చింది అయితే కేవ‌లం 65 ఏళ్లు పైబడిన వారికి, అత్య‌వ‌స‌ర‌మైన వారికి మాత్ర‌మే అని ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు బూస్ట‌ర్ డోస్ అందించ‌డం కుద‌ర‌ద‌ని పేర్కొంది.

  • Share this:
    స్విట్జ‌ర్లాండ్ (Switzerland)  ప్ర‌భుత్వం కోవిడ్ 19 (COVID-19) బూస్ట‌ర్ డోస్‌కు అనుమ‌తి ఇచ్చింది అయితే కేవ‌లం 65 ఏళ్లు పైబడిన వారికి, అత్య‌వ‌స‌ర‌మైన వారికి మాత్ర‌మే అని ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు బూస్ట‌ర్ డోస్ అందించ‌డం కుద‌ర‌ద‌ని పేర్కొంది. ఈ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ న‌వంబ‌ర్‌నుంచి ప్రారంభం అవుతుంద‌ని స్విట్జ‌ర్లాండ్ ప్ర‌భుత్వం పేర్కొంది. అయితే రెండు డోసులు వేసుకొని ఆరు నెల‌లు పూర్త‌యిన వారికి మాత్ర‌మే ఈ డోస్ పొందే వీలుంటుంద‌ని తెలిపింది. సాధార‌ణ జ‌నం ఎప్పుడు తీసుకోవాల‌న్న‌ది మాత్రం . స్విట్జర్లాండ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ, వ్యాక్సినేషన్ కమిషన్ (EKIF) , స్విస్ మెడిసిన్ రెగ్యులేటర్ యొక్క నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా రోగుల కోసం అధిక ప్రమాదం ఉన్న రోగుల కోసం ఫైజర్ (PFE.N)/బయోన్‌టెక్ మరియు మోడర్నా (MRNA.O) నుంచి mRNA వ్యాక్సిన్‌లు ఉన్నాయని మంత్రిత్వ శాఖ మరియు EKIF తెలిపింది.

    అమెరికాలోనూ..
    యునైటెడ్ స్టేట్స్ (United States) లాంటి కొన్ని దేశాలు, ఎక్కువ ఇన్ఫెక్షన్ రిస్క్ ఉన్న ప్రజలకు బూస్టర్ షాట్లు తీసుకోవడాన్ని తప్పనిసరి చేశాయి. కానీ భారతదేశంలో, అక్టోబర్ 3 నాటికి అర్హత గల వయోజనులలో కేవలం 26.3% మంది మాత్రమే పూర్తిగా వ్యాక్సినేట్ చేయబడ్డారు. సమానంగా వ్యాక్సిన్ పంపిణీ, అందుబాటు లేకపోవడం ఇందుకు కారణం.

    Covid 19 : మ‌రో కొత్త వేరియంట్‌.. మ‌ధ్యప్ర‌దేశ్‌లో ఏవై.4 రకం కేసులు


    అయితే రెండో వ్యాక్సినేషన్ డోసు తర్వాత చాలా మందిలో యాంటీబాడీల సంఖ్య తగ్గిపోతున్నట్లు వస్తున్న రిపోర్టులను బట్టి, భారతదేశంలో సగం జనాభాకు పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ అందకముందే, అందరికీ బూస్టర్ షాట్ల అవసరం రావచ్చు. ఇక డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది విషయంలో, ఇది చాలా అత్యవసర పరిణామం, అందుకే పరిస్థితిని వారి చేతుల్లోకి తీసుకుంటున్నారు.

    డాక్ట‌ర్ల‌కు అవ‌స‌రం..
    డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది వైపు నుండి చూస్తే, ఎక్కువ-రిస్క్ ఉన్న వారికి ప్రత్యేకంగా మూడో బూస్టర్ షాట్ వ్యాక్సిన్ వేసుకునే విధానాన్ని అమలు చేయడమే దీనికి ఏకైక పరిష్కారం. వనరులను మళ్లించడం, వ్యాక్సినేషన్ ప్రయత్నాలను పెంచడం కంటే బూస్టర్ డోసుల కారణంగా భారతీయ జనాభా మరింత రోగనిరోధకంగా మారి, సురక్షితంగా తయారయ్యే పరిస్థితి ఉంది. నిరంత‌రం విధుల్లో ఉండ‌డం వ‌ల్ల డాక్ట‌ర్లు హై రిస్క్‌లో ఉంటున్నారు. వారికి బూస్ట‌ర్ డోస్ అవ‌స‌రం అనే వాద‌న వినిపిస్తున్నాయి. అయితే చాలా దేశాల్లో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ఇంకా స‌రిగా ప్రారంభం కాలేదు. ఇప్పుడే బూస్ట‌ర్ డోస్ ప్ర‌వేశ పెడితే చాలా మందికి వ్యాక్సిన్ అంద‌దు అనే అభిప్రాయం వ్య‌క్తం అవుతుంది.
    Published by:Sharath Chandra
    First published: