Home /News /coronavirus-latest-news /

COVID 19 VACCINATION GOVT INTRODUCE VACCINE FOR CHILDREN KNOW COST DETAILS EVK

Covid 19 Vaccination : పిల్ల టీకా వ‌చ్చేసింది.. సూది అవ‌స‌రం లేదు.. ధ‌ర ఎంతో తెలుసా?

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

Covid 19 Vaccination : ప్ర‌భుత్వం పిల్ల‌ల టీకా ప్ర‌వేశ పెట్టేందుకు కృషిచేస్తోంది. అందులో భాగంగా జైడస్‌ క్యా డిలా రూపొం దిం చిన కొవిడ్‌ టీకా జైకోవ్‌-డీ (Zycov-D) టీకాను చిన్నారుల‌కు అందించేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆ సంస్థ‌తో అంద‌రికీ అందుబాటులో ఉండే ధ‌ర‌ను అందించాల‌ని ప్ర‌భుత్వం చ‌ర్చ‌లు ప్రారంభించింది.

ఇంకా చదవండి ...
    ప్ర‌భుత్వం పిల్ల‌ల టీకా ప్ర‌వేశ పెట్టేందుకు కృషిచేస్తోంది. అందులో భాగంగా జైడస్‌ క్యా డిలా రూపొం దిం చిన కొవిడ్‌ టీకా జైకోవ్‌-డీ (Zycov-D) టీకాను చిన్నారుల‌కు అందించేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆ సంస్థ‌తో అంద‌రికీ అందుబాటులో ఉండే ధ‌ర‌ను అందించాల‌ని ప్ర‌భుత్వం చ‌ర్చ‌లు ప్రారంభించింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ చ‌ర్చ‌లు స‌ప‌ల‌మైనట్టు అధికారిక వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే అధికారిక ప్ర‌క‌ట‌న మాత్రం రావాల్సి ఉంది. చిన్నారులకు సూది అవ‌స‌రం లేకుండా విడ్‌ టీకా జైకోవ్‌-డీ (Zycov-D)ను అందించ‌వ‌చ్చు. ఈ టీకాను త‌క్కువ ధ‌ర‌కు అందించాల‌నేది ప్ర‌భుత్వ ల‌క్ష్యం. ఇప్ప‌టికే దేశంలో కేవ‌లం 18 ఏళ్ల పైబ‌డిన వారికి మాత్ర‌మే టీకాలు వేస్తున్నారు. చిన్నారుల‌కు టీకా వేయ‌డం లేదు. త్వ‌రలో వారికీ టీకా వేయాల‌నేది ప్ర‌భుత్వ ల‌క్ష్యం

    టీకా ధ‌ర‌లు..
    కొవిడ్‌ టీకా జైకోవ్‌-డీ (Zycov-D)ను జైడస్‌ క్యా డిలా రూపొందించింది. ఈ టీకాకు సంబంధించి తొలుత రూ.1900కు టీకాను అందజేస్తామని ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు పంపింది. దీనిపై ప్ర‌భుత్వం చ‌ర్చ‌లు జ‌రిపింది. మార్కెట్లో ఉన్న టీకాల ధ‌ర‌లు అవ‌స‌రాల‌ను ప‌రిశీలించింది. చివ‌ర‌గా ఒక డోసు రూ.265కు అందించాల‌ని సంస్థ‌కు సూచించింది. దీనికి సంస్థ ఒప్పుకొన్న‌ట్టుస‌మ‌చారం.

    Covid 19 : మ‌రో కొత్త వేరియంట్‌.. మ‌ధ్యప్ర‌దేశ్‌లో ఏవై.4 రకం కేసులు


    అంతే కాకుండా ఈ టీకాను సూది లేకుండా వాడాలి.. ఇందుకోసం జెట్‌ అప్లికేటర్‌ను వినియోగించాలి. దాని ధ‌ర రూ. 93తో క‌లుపుకొని ఒక డోసు మొత్తానికి రూ.358 అవనున్నట్లు తెలుస్తోం ది. ఈ టీకాను 28 రోజుల వ్య‌వ‌ధిలో వేసుకోవాల్సి ఉంటుంది. గుజరాత్‌కు చెం దిన జైడస్‌ క్యా డిలా రూపొం దిం చిన ఈ టీకా.. ప్రపం చం లోనే అనుమతి పొం దిన డీఎన్‌ఏ ఆధారిత తొలి కరోనా టీకా.

    పెరుగుతున్న కోవిడ్ కేసులు..
    ప‌శ్చిమ బెంగాల్‌ (Bengal), అస్సాం రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసులు మ‌ళ్లీ పెరుగుత‌న్న‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో కోవిడ్ పాజిటివిటీ (Positivity Rate) రేటు క్ర‌మంగా పెరుగుతోంది. బెంగాల్‌లో నెల రోజుల్లో పాజిటివిటీ రేటు1.93 నుంచి 2.39కు పెరిగింది. అస్సాలంలో నెల‌రోజుల్లో పాజిటివిటీ రేటు 1.89% నుం చి 2.22% పెరిన‌ట్టు స‌మాచారం. త‌క్ష‌ణ‌మే ఆయా రాష్ట్రాలు కోవిడ్ ప‌రీక్ష‌లు, నియంత్ర‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని లేఖ రాసింది.

    జికా కేసులు..
    ఇప్పుడిప్పుడే క‌రోనా ప్ర‌భావం నుంచి దేశం బ‌య‌ట‌ప‌డుతోంది. ఈ స‌మ‌యంలో కొత్త‌గా జికా  వైర‌స్ (Zika Virus) వ్యాప్తి చెందుతుందా అనే ఆందోళ‌న ప్ర‌జ‌ల్లో క‌లుగుతోంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ (Uttar Pradesh) లోని కాన్పూర్‌లో మూడు జికా వైర‌స్ కేసులు న‌మోదు కావ‌డంపై క‌ల‌క‌లం రేగుతోంది. దీంతో వైర‌స్ వ్యాప్తిని నిరోధించేందుకు అధికారులు బాధితుల‌కు స‌న్నిహితంగా ఉన్న వారిని గుర్తించి వారికి చికిత్స అందించే ప‌నిలో ప‌డ్డారు. ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లో కాన్పూర్‌ (Kanpur)లోనే ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు కేసులు న‌మోద‌య్యాయి. బాధితుల‌కు జికా వైర‌స్ సోకిన‌ట్టు వైద్యాధికారులు గుర్తించారు. ప్ర‌స్తుతం ఈ బాధితులు ఆరోగ్యశాఖ అధికారుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నాయి. యుద్ధ ప్రాతిప‌దిక‌న బాధితుల‌ను క‌లిసిన వారిని గుర్తించేప‌నిలో అధికారులు నిమ‌గ్న‌మ‌య్యారు.
    Published by:Sharath Chandra
    First published:

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు