హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Corona vaccine: వ్యాక్సినేషన్ డ్రైవ్ ఎప్పటి వరకు ఉంటుందంటే.. వామ్మో అన్ని రోజులా..

Corona vaccine: వ్యాక్సినేషన్ డ్రైవ్ ఎప్పటి వరకు ఉంటుందంటే.. వామ్మో అన్ని రోజులా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

డీసీజీఐ (DCGI) ఆమోద ముద్రవేసిన కోవిషీల్డ్, కొవాగ్జిన్.. ఈ రెండూ సురక్షితమైనవేనని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. వీటిలో ఏ టీకా వేసుకోవాలో ఎంపిక చేసుకునే అవకాశం ఉండదని.. ఈ రెండింటిలోనే ఏదో ఒక టీకా అందుతుందని తెలిపింది.

  మన దేశంలో జనవరి 16 నుంచి కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభంకానుంది. తొలి దశలో డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఇతర ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు టీకా అందజేస్తారు. రెండో దశలో 50 ఏళ్లు పైబడిన వారికి, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి టీకాలు వేస్తారు. ఆ తర్వాత సాధారణ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. మరి మన దేశంలో 130 కోట్ల మంది జనాభా ఉన్నారు. అంత మందికి టీకా వేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ ఎన్ని రోజుల పాటు ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలు అందరిలోనూ ఉత్పన్నమవుతున్నాయి. ఈ క్రమంలో వ్యాక్సినేషన్ డ్రైవ్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ప్రకటన చేసింది. మన దేశంలో ఒక ఏడాది కంటే పైనే ఈ ప్రక్రియ ఉంటుందని తెలిపింది.

  డీసీజీఐ (DCGI) ఆమోద ముద్రవేసిన కోవిషీల్డ్, కొవాగ్జిన్.. ఈ రెండూ సురక్షితమైనవేనని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. వీటిలో ఏ టీకా వేసుకోవాలో ఎంపిక చేసుకునే అవకాశం ఉండదని.. ఈ రెండింటిలోనే ఏదో ఒక టీకా అందుతుందని తెలిపింది. వీటితో పాటు జైడుస్ క్యాడిల్లా తయారుచేసిన జైకోవ్ డీ, రష్యా వాక్సిన్ స్పుత్నిక్-వీ, హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్-ఈ, జెనోవా సంస్థల వ్యాక్సిన్లు కూడా ట్రయల్స్ దశలో ఉన్నాయని వెల్లడించింది. వీటిలో జైకోవ్ డీ వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాల్లో ఉంది. ఇక స్పుత్నిక్-వీ రెండో దశ, బయోలాజికల్-ఈ ఒకటో దశ ప్రయోగాలను పూర్తి చేసుకున్నాయి. జెనోవా సంస్థ RNA ఆధారిత కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. మరికొద్ది రోజుల్లోనే వీటిని కూడా అత్యవసర వినియోగానికి అనుమతించే అవకాశాలు ఉన్నాయని కేంద్రం తెలిపింది.

  తొలిదశ వ్యాక్సినేషన్ కోసం..కోవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్‌లకు కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. సీరం ఇన్‌స్టిట్యూట్‌ నుంచి 1.10 కోట్ల కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోసులను సేకరిస్తోంది. ఒక్కో డోసు ధర రూ.200 గా ఉన్నట్లు వెల్లడించింది. అటు భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌‌ను 55లక్షల డోసుల మేర కేంద్రం కొనుగోలు చేస్తోంది. వీటిలో 38.5లక్షల డోసుల వ్యాక్సిన్‌కు ప్రతి డోసుకు రూ.295 ధర చెల్లించనుంది. మరో 16.5 లక్షల డోసులను మాత్రం భారత్‌ బయోటెక్‌ ఉచితంగానే అందిస్తోంది. జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. అన్ని రాష్ట్రాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇప్పటికే వ్యాక్సిన్‌లు అన్ని కేంద్రాలకు చేరాయి.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Corona Vaccine, Covaxin, COVID-19 vaccine, Covishield

  ఉత్తమ కథలు