రష్యా, చైనా తయారు చేసే కరోనా వ్యాక్సిన్లను...మా దేశంలో అనుమతించం...

అమెరికా మాత్రం రష్యా వ్యాక్సిన్ తయారీపై మొదటి నుంచి ఆరోపణలు గుప్పిస్తోంది. తమ శాస్త్రవేత్తల పరిశోధనలు హ్యాక్ చేసి వారు వ్యాక్సిన్ తయారీలో అనేక దశలను బుట్టదాఖలు చేసి మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారని ఆరోపణలు చేసింది.

news18-telugu
Updated: August 3, 2020, 3:58 PM IST
రష్యా, చైనా తయారు చేసే కరోనా వ్యాక్సిన్లను...మా దేశంలో అనుమతించం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ ట్రయల్స్ జోరందుకున్నాయి. ఇప్పటికే రష్యా తన క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకొని, మార్కెట్లోకి కోవిడ్ వ్యాక్సిన్ తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుండగా, చైనాకు చెందిన మూడు కంపెనీలు సైతం తుది క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకొని మార్కెట్లోకి వ్యాక్సిన ప్రవేశ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే అటు ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం, ఆస్ట్రజెనికా సంయక్తంగా తయారు చేస్తున్న వ్యాక్సిన్ సైతం తుది పరీక్షలకు చేరుకుంది. దీంతో సుమారు ఒకే సారి 5 కంపెనీల నుంచి వ్యాక్సిన్స్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే అమెరికా మాత్రం రష్యా వ్యాక్సిన్ తయారీపై మొదటి నుంచి ఆరోపణలు గుప్పిస్తోంది. తమ శాస్త్రవేత్తల పరిశోధనలు హ్యాక్ చేసి వారు వ్యాక్సిన్ తయారీలో అనేక దశలను బుట్టదాఖలు చేసి మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారని ఆరోపణలు చేసింది. అంతేకాదు చైనా, రష్యాలు అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ భద్రతపై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని అమెరికా నిపుణులు ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రష్యా సెప్టెంబర్‌లోపు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెస్తామని ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. అయితే, అమెరికా మొడెర్నా, ఇంగ్లాండ్ ఆక్స్‌ఫర్డ్ టీకాలపైనే ప్రపంచదేశాల్లో చాలా వరకూ అంచనాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే అమెరికాకు చెందిన టాప్ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోని ఫౌచీ కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రగ్ రెగ్యులేటరీ పారదర్శకంగా లేని దేశాల టీకాలను అమెరికా స్వీకరించదని స్పష్టం చేశారు. ముఖ్యంగా చైనా, రష్యాలు తయారు చేస్తున్న టీకాలను ఎట్టి పరిస్థితుల్లో అమెరికాలో వినియోగించే అవకాశాలు లేవని చెప్పారు. ఆయా దేశాలు టీకాపై సరైన ప్రయోగాలు చేపట్టకుండా మార్కెట్లోకి తెస్తున్నారని ఆరోపించారు. సరైన టెస్టులు చేయకుండానే వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులో ఉంచితే ప్రమాదం అని అమెరికన్ నిపుణులు వాదిస్తున్నారు.
Published by: Krishna Adithya
First published: August 3, 2020, 3:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading