COVID 19 THIRD WAVE STARTED IN NAGPUR OF MAHARASHTRA SAYS STATE MINISTER NITIN RAUT AK
Corona Third Wave: దేశంలోని ఆ నగరంలో మొదలైన కరోనా థర్డ్ వేవ్.. త్వరలోనే మళ్లీ ఆంక్షలు
ప్రతీకాత్మక చిత్రం
Corona Thrid Wave: కరోనా కొత్త కేసులకు కోవిడ్ కేర్ సెంటర్లో క్వారంటైన్ తప్పనిసరి అని పేర్కొన్నారు. కరోనా లక్షణాలు ఉన్నా లేకపోయినా 10 రోజులు క్వారంటైన్లో ఉండాల్సిందే అని స్పష్టం చేశారు. ఈ రకమైన చర్యలు తీసుకున్న మొదటి నగరం నాగ్‌పూర్ మాత్రమే కావడం గమనార్హం.
దేశంలో కరోనా థర్డ్ వేవ్ ఎప్పుడు వస్తుందనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. అయితే మన దగ్గర కరోనా థర్డ్ వేవ్ ప్రభావం సెప్టెంబర్‌లోనే మొదలవుతుందని.. అక్టోబర్‌లో అది పతాకస్థాయికి చేరుకుంటుందనే వార్తలు కూడా వచ్చాయి. అయితే కరోనా థర్డ్ వేవ్ రావడం, రాకపోవడం అనేక ప్రజల చేతిల్లోనే ఉంది. కరోనా నిబంధనలు పాటిస్తే.. కరోనా థర్డ్ వేవ్ నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే మహారాష్ట్రలోని ప్రధాన నగరాల్లో ఒకటైన నాగ్‌పూర్‌లో కరోనా థర్డ్ వేవ్ మొదలైంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర మంత్రి నితిన్ రౌత్ ప్రకటించారు. నాగ్‌పూర్‌లో కరోనా థర్డ్ వేవ్ మొదలైందని.. త్వరలోనే ఆంక్షలు విధించే అవకాశం ఉందని ఆయన ప్రకటించారు. సీనియర్ అధికారులు, రెవెన్యూ, పోలీస్, హెల్త్ అధికారులతో సమీక్షా సమావేశం అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
నగరంలో కరోనా థర్డ్ వేవ్ అడుగుపెట్టిందని.. రెండు రోజుల నుంచి కేసుల పెరుగుదల మొదలైందని ఆయన అన్నారు. కరోనా కేసుల పెరుగుదల నేపథ్యోం మళ్లీ ఆంక్షలు విధించే అంశంపై కూడా ఆయన స్పందించారు. రెండు మూడు రోజుల్లో దీనిపై అధికారులు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ప్రజల ప్రాణాలు కాపాడటం కోసమే ఆంక్షలు విధిస్తామని వ్యాఖ్యానించారు. గత నెలలో నాగ్‌పూర్ జిల్లాలో కేవలం 145 కేసులు, రెండు మరణాలు నమోదయ్యాయి.
అయితే ఈ నెలలో ఇప్పటివరకు 42 కొత్త కేసులు, ఒక మరణం నమోదైంది. మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రజలు డబుల్ మాస్కులు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే.. విదర్భ ప్రాంతంలో కరోనా కేసులు ఆగస్టులో గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో అక్కడ ఆంక్షలను పూర్తిగా సడలించారు.
మరోవైపు నాగ్‌పూర్‌లో కరోనా కేసులు పెరగడంపై నగర మున్సిపల్ కమిషనర్ స్పందించారు. కరోనా కొత్త కేసులకు కోవిడ్ కేర్ సెంటర్లో క్వారంటైన్ తప్పనిసరి అని పేర్కొన్నారు. కరోనా లక్షణాలు ఉన్నా లేకపోయినా 10 రోజులు క్వారంటైన్లో ఉండాల్సిందే అని స్పష్టం చేశారు. ఈ రకమైన చర్యలు తీసుకున్న మొదటి నగరం నాగ్‌పూర్ మాత్రమే కావడం గమనార్హం.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.