CoronaVirus: వామ్మో.. కరోనా మహమ్మారితో ఈ రకమైన కొత్త ప్రమాదం.. చాలా జాగ్రత్త

CoronaVirus: వామ్మో.. కరోనా మహమ్మారితో ఈ రకమైన కొత్త ప్రమాదం.. చాలా జాగ్రత్త

ప్రతీకాత్మక చిత్రం

CoronaVirus: వాసన కోల్పోవడంతో లైంగిక కోరికలు కూడా తగ్గుతాయని తాజా అధ్యయనం పేర్కొనడంతో మరింత ఆందోళకరంగా మారింది.

  • Share this:
కరోనా వైరస్ ఇప్పటివరకు ఊపిరితిత్తులు, హృద్రోగ సమస్యలు సృష్టిస్తుందని వైద్యులు అంచనా వేశారు. కానీ పురుషుల లైంగిక సామర్థ్యం, సంతాన ఉత్పత్తిపై కూడా ఇది ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనం బయటపెట్టింది. కరోనా భారీన పడ్డ వారు సహజంగా వాసన కోల్పోతుంటారు. దీన్నే అనోస్మియా అని పిలుస్తారు. అయితే, ఇది క్రమంగా పురుషుల లైంగిక కోరికలను తగ్గిస్తుందని అమెరికా పరిశోధకుల తాజా అధ్యయనంలో తేలింది. లైంగిక ప్రేరణలో వాసన అనేది బలమైన పాత్రని పోషిస్తుందని నిపుణులు అంటున్నారు. వాసన కోల్పోవడం వల్ల శృంగారం పట్ల ఆసక్తి తగ్గుతుందని వారు స్పష్టం చేస్తున్నారు. కాగా, ఈ అధ్యయనం 65 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల వృద్ధులపై జరిగింది.

అయితే, దీని ప్రభావం ఎక్కువగా వృద్ధులపైనే ఉంటుందని, యువకులు త్వరగానే కోలుకొని తిరిగి తమ లైంగిక సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారని అధ్యయనం పేర్కొంది. అధ్యయనంలో భాగంగా బోస్టన్‌లోని బ్రిగమ్ ఉమెన్స్ హాస్పిటల్‌కు చెందిన నిపుణుల బృందం అమెరికాలోని 2,084 మంది వృద్ధులపై పరిశోధన చేసింది. వీరంతా 65 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గలవారు. పరిశోధనలో పాల్గొన్న వారి వయస్సు, లింగం, జాతి, విద్య, తెలివితేటలు వంటి వాటిని పరిగణలోకి తీసుకున్నారు. కానీ, కరోనా కారణంగా వాసన కోల్పోవడానికి, లైంగిక కోరికలు తగ్గడానికి మధ్య ఉన్న సంబంధాన్ని మాత్రం అధ్యయనవేత్తలు వివరించలేదు.

కాగా, దీనిపై చికాగో యూనివర్సిటీ అధ్యయన రచయిత జెస్సీ కె. సీగెల్ మాట్లాడుతూ 'కరోనా కారణంగా వాసన కోల్పోవడం అనేది వారి లైంగిక పనితీరు క్షీణించడానికి కారణమవుతుందని మా పరిశోధన చూపిస్తుంది. అందువల్ల, లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు వైద్యులు పరిష్కార మార్గాలను కనుగొనాల్సిన అవసరం ఉంది. లైంగిక ప్రేరణలను ప్రాసెస్ చేయడంలో కీలక పాత్ర పోషించే లింబిక్ సిస్టమ్ కి కరోనాతో వాసన కోల్పోవడానికి మధ్య సంబంధం ఉంది.' అని అమె అన్నారు. ఈ అధ్యయన ఫలితాలను ‘ది జర్నల్ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్’ ప్రచురించారు.

2,084 మంది వృద్ధులపై జరిగిన అధ్యయనం..
కాగా, ఈ అధ్యయనం కోవిడ్‌కు ముందు జరిగింది. అంటే, ప్రస్తుతం కోవిడ్ ఉన్నవారిలో వాసన కోల్పోవడం ద్వారా లైంగిక కోరిలు సన్నగిల్లడానికి మధ్య సంబంధాన్ని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సాధారణంగా కరోనా సోకిన వారిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి వంటి సమస్యలు వస్తుంటాయి. వీటితో పాటు కొందరిలో వాసన, రుచి కోల్పోవడం కూడా జరుగుతుంది. అయితే, వాసన కోల్పోవడంతో లైంగిక కోరికలు కూడా తగ్గుతాయని తాజా అధ్యయనం పేర్కొనడంతో మరింత ఆందోళకరంగా మారింది. అయితే, ఇప్పటివరకు యూకేలో 3.5 మిలియన్ల మంది, అమెరికాలో 10 లక్షల మంది కరోనా కారణంగా వాసన కోల్పోయారని అధ్యయనం స్పష్టం చేసింది. ఈ మాయదారి మహమ్మారి రోజుకో కొత్త లక్షణంతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది.
Published by:Kishore Akkaladevi
First published:

అగ్ర కథనాలు