హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

సెకండ్ వేవ్ ముగియ‌లేదు.. 16శాతం మందికి వ్యాక్సినేష‌న్ పూర్తి: కేంద్ర ఆరోగ్య‌శాఖ‌

సెకండ్ వేవ్ ముగియ‌లేదు.. 16శాతం మందికి వ్యాక్సినేష‌న్ పూర్తి: కేంద్ర ఆరోగ్య‌శాఖ‌

ప్రతీకాత్మక చిత్రం (image credit - twitter - reuters)

ప్రతీకాత్మక చిత్రం (image credit - twitter - reuters)

దేశ జ‌నాభాలో ఇప్ప‌టిక వ‌ర‌కు 16శాతం మందికి రెండు డోస్‌ల(Second Dose) టీకా వేసిన‌ట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దేశంలో 54శాతం మందికి మొద‌టి డోస్(First Dose) వేసిట్టు తెలిపింది. అంతే కాకుండా దేశంలో "రెండవ వేవ్" (Second Wave) ఇంకా ముగియలేద‌ని.. ప్ర‌జ‌లు ఇంకా జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని సూచించింది.

ఇంకా చదవండి ...

దేశ జ‌నాభాలో ఇప్ప‌టిక వ‌ర‌కు 16శాతం మందికి రెండు డోస్‌ల టీకా వేసిన‌ట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అంతే కాకుండా దేశంలో 54శాతం మందికి మొద‌టి డోస్ వేసిట్టు తెలిపింది. అంతే కాకుండా దేశంలో "రెండవ వేవ్"(Second Wave) ఇంకా ముగియలేద‌ని.. ప్ర‌జ‌లు ఇంకా జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని సూచించింది. ప్ర‌స్తుతం దేశంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,28,57,937 కి పెరిగిన‌ట్టుప్ర‌క‌టించింది. దేవంలో కోవిడ్ 19 ఇన్ఫెక్ష‌న్ (Infection) శాతం 1.19గా ఉన్న‌ట్టు ప్ర‌క‌టించింది. వీటితో పాటు కేంద్ర ఆరోగ్యశాఖ ప‌లు విష‌యాల‌ను వెల్ల‌డించింది.

ముఖ్యాంశాలు అంశాలు ఇవే..

• దేశంలోని మొత్తం వయోజన జనాభాలో 16% పూర్తిగా టీకాలు వేయబడ్డారు. ఈ దేశంలోని మొత్తం వయోజన జనాభాలో 54% మంది ఒక్క డోస్ అందుకున్నారని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు.

• మేము 2021 ఆగస్టు నెలలో మాత్రమే 18.38 కోట్ల డోస్‌లు ఇచ్చాం. ఆగస్టులో రోజుకు సగ‌టున‌ 59.29 లక్షల డోసులు ఇచ్చాం. నెల చివరి వారంలో మేము రోజుకు 80 లక్షలకు పైగా డోసులు ఇచ్చామ‌ని భూషణ్ చెప్పారు.

Monsoon Diseases: ఈ జాగ్రత్తలు పాటిస్తే సీజనల్ వ్యాధులు మీ దరికి రావు.. తెలుసుకోండి


• దేశంలో "రెండవ వేవ్" ఇంకా ముగియలేదు. ప్రజ‌లంతా కోవిడ్ -19 నిబంధనలను ఖచ్చితంగా పాటించాల‌ని భూషణ్ సూచించారు.

• దేశంలో 279 జిల్లాల నుంచి రోజు 100 కేసులు వ‌చ్చేవ‌ని ప్ర‌స్తుతం కేవ‌లం 42 జిల్లాల్లో మాత్ర‌మే రోజువారీగా 100 కేసులు న‌మోదవుతున్నాయ‌ని తెలిపారు. దేశంలో వీక్లీ పాజిటివిటీని 5-10% మధ్య ఉంది.

• ప్ర‌స్తుతం దేశంలో కేర‌ళ‌లో 1 లక్షకు పైగా యాక్టివ్ కేసులు(Active Cases) ఉన్నాయి. దేశంలో నాలుగు రాష్ట్రాల్లో 10,000 నుంచి 1 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. అవి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. మిగిలిన రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల‌ల్లో 10,000 కంటే తక్కువ యాక్టివ్ కేసులు ఉన్నాయి.

• సిక్కిం, దాద్రా మరియు నాగర్ హవేలి మరియు హిమాచల్ ప్రదేశ్(Himachal pardesh) వారి 18 ఏళ్ల కంటే ఎక్కువ జనాభాలో 100% మందికి కోవిడ్ -19 టీకా మొదటి డోస్‌ను అందించారు.

• టీకాలు వేసిన తర్వాత కూడా మాస్కులు ధరించాలని .. పండగ స‌మ‌యం కావున గుంపులుగా తిర‌గ‌వ‌ద్ద‌ని ఐసీఎమ్ఆర్ డీజీ డాక్టర్ బలరాం భార్గవ సూచించారు.

• చాలామంది గర్భిణీ స్త్రీలు టీకాలు వేయడం లేదు, వారు టీకా వేసుకొనేందుకు ముందుకు రావాలి. ఇది వారికి మరియు పిల్లలకు ముఖ్యం అని నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) వికె పాల్ సూచించారు.

• యుకె, యూర‌ప్‌, మిడిల్ ఈస్ట్‌, ద‌క్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, బోట్స్వానా, ఐర్లాండ్ మరియు జింబాబ్వే నుంచి తిరిగి వచ్చిన వారు కూడా RTPCR టెస్టు చేయించుకోవాలి. వారు ఇండియాలోకి రాగానే ప‌రీక్ష నిర్వ‌హిస్తామ‌ని భూషణ్ తెలిపారు. దీని వ‌ల్ల కొత్త కోవిడ్ వేరియంట్‌ల‌ను నిరోధించొచ్చు అన్నారు.

• దేశంలో ప్ర‌స్తుతం దాదాపు 300 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. మ్యుటేషన్‌కు వ్యతిరేకంగా ఈ టీకా ప్రభావవంతంగా ఉన్నట్లు వైద్య శాఖ గుర్తించింది.

First published:

Tags: Covid -19 pandemic