కరోనా ఆస్పత్రులపైనా నిసర్గ తుఫాన్ ప్రభావం

ముంబైలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40,887కి చేరింది. కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు BMC (బృహన్ ముంబై కార్పొరేషన్) పరిధిలో 1,319 మంది మరణించారు.

news18-telugu
Updated: June 2, 2020, 3:52 PM IST
కరోనా ఆస్పత్రులపైనా నిసర్గ తుఫాన్ ప్రభావం
కరోనా ఆస్పత్రులపైనా నిసర్గ తుఫాన్ ప్రభావం
  • Share this:
పశ్చిమ తీరంలో నిసర్గ తుఫాన్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. వేగంగా దూసుకొస్తూ ముంబై వాసుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇప్పటికే కరోనాతో అల్లాడుతున్న ముంబైకర్స్.. ఈ తుఫాన్ భయంతో మరింత ఆందోళన చెందుతున్నారు. అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే 12 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముంబైకి చేరుకున్నాయి. ఐతేన ఈ తుఫాన్ ప్రభావం కరోనా ఆస్పత్రులపైనా పడింది. వాతావరణశాఖ హెచ్చరిక నేపథ్యంలో బంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లోని MMRDA సెంటర్‌ను ఖాళీ చేయించారు. అక్కడి నుంచి 150-200 మంది కరోనా పేషెంట్లను వర్లీలోని NSCIకి తరలించారు.

కాగా, సోమవారం రాత్రి బులెటిన్ ప్రకారం.. మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 70,013కి చేరింది. కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 30,108 మంది కోలుకోగా..2,362 మంది మరణించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 37,534 యాక్టిక్ కరోనా కేసులున్నాయి. ఇక మహారాష్ట్రలో నమోదైన కేసుల్లో అత్యధికం ముంబైలోనే ఉన్నాయి. ముంబైలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40,887కి చేరింది. కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు BMC (బృహన్ ముంబై కార్పొరేషన్) పరిధిలో 1,319 మంది మరణించారు.

First published: June 2, 2020, 3:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading