గాంధీ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరతతో కరోనా రోగి మృతి

ప్రతీకాత్మక చిత్రం

గాంధీలో ఆక్సిజన్ పెట్టకపోవడం వల్ల ఇవాళ ఉదయం ఓ కరోనా రోగి చనిపోయాడు.

  • Share this:
    కరోనా కారణంగా మరణిస్తున్న రోగుల్లో ఎక్కువమంది ఆక్సిజన్ అందక చనిపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగి ఇదే రకంగా చనిపోవడం కలకలం రేపుతోంది. శ్రీధర్ అనే వ్యక్తి నాలుగు రోజులుగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నాడు. రెండు రోజుల క్రితం ఉస్మానియా ఆసుపత్రిలో చేరాడు. వైద్య పరీక్షలు నిర్వహించడంతో అతడికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో అతడిని ఉస్మానియా నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీలో ఆక్సిజన్ పెట్టకపోవడం వల్ల ఇవాళ ఉదయం బాధితుడు శ్రీధర్ చనిపోయాడు. ఉస్మానియాలో ఆక్సిజన్ పెట్టిన వైద్యులు గాంధీ లో మాత్రం ఆక్సిజన్ పెట్టకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే శ్రీధర్ చనిపోయాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
    Published by:Kishore Akkaladevi
    First published: