దారుణం.. కరోనా రోగుల మృతదేహాలను లాక్కెళ్లి.. ప్రొక్లెయిన్‌తో..

చనిపోయిన రోగుల పట్ల కొంతమంది సిబ్బంది దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కనీసం చనిపోయిన వ్యక్తికి ఇవ్వాల్సిన కనీస మర్యాద లేకుండా దారుణంగా మృతదేహాలను ఈడ్చుకుంటూ వెళ్లి గోతుల్లో పడేసి పూడ్చుతున్నారు.

news18-telugu
Updated: July 2, 2020, 1:19 PM IST
దారుణం.. కరోనా రోగుల మృతదేహాలను లాక్కెళ్లి.. ప్రొక్లెయిన్‌తో..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ పేరు చెబితేనే ప్రపంచ దేశాలు వణికిపోయే పరిస్థితి. ఆగ్రదేశాలంటూ చెప్పుకునే దేశాలు సైతం కరోనా వైరస్ ముందు ఓడిపోయిన పరిస్థితి. ప్రధానంగా గత ఐదు నెలలుగా కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనా వైరస్ నివారణకు ఖచ్చితమైన మెడిసిన్ లేకపోవడంతో స్వీయ జాగ్రత్తలే రక్షణగా నిలుస్తున్నాయి. అయితే కొంతమంది కరోనా వైరస్ సోకి మృత్యువాత పడుతున్నారు. అలా చనిపోయిన రోగుల పట్ల కొంతమంది సిబ్బంది దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కనీసం చనిపోయిన వ్యక్తికి ఇవ్వాల్సిన కనీస మర్యాద లేకుండా దారుణంగా మృతదేహాలను ఈడ్చుకుంటూ వెళ్లి గోతుల్లో పడేసి పూడ్చుతున్నారు. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో రెండు వేర్వేరు ఘటనల్లో కరోనా వైరస్ సోకి చనిపోయిన ఇద్దరి మృతదేహాల పట్ల కొంతమంది సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారు.


కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాలో కరోనాతో చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహాన్ని 200 మీటర్ల మేర ఈడ్చుకుంటూ వెళ్లి గోతిలో పడేశారు. మరో ఘటనలో కర్ణాటకలోని దేవనగర్‌లో కరోనాతో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలను ప్రొక్లెయిన్‌తో నిర్వహించారు. సమాధిని ప్రొక్లెయిన్‌తో తవ్వి అందులో మృతదేహాన్ని విసిరేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వెలుగులోకి వచ్చాయి. వాస్తవానికి భారతీయ సంప్రదాయంలో చనిపోయిన వ్యక్తికి ఎంతో గౌరవంతో అంతిమ సంస్కరాలు నిర్వహిస్తారు. అలాంటి వాటిని ఏం పట్టించుకోకుండా సిబ్బంది వ్యవహరిస్తున్నతీరు విమర్శలకు దారితీస్తోంది.

కరోనా మహమ్మారి సోకి చనిపోయిన వ్యక్తుల అంత్యక్రియలను నిర్వహించేందుకు అవగాహన లేక కుటుంబ సభ్యులు ముందుకు రాకపోవడమో లేదా వారు సైతం కరోనా వైరస్ సోకి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న సందర్భాల్లో మిగతా వారు అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు రావడం లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వ సిబ్బందే అంత్యక్రియలు చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో కొంతమంది సిబ్బంది కరోనాతో చనిపోయిన వారి పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వాటిపట్ల ప్రభుత్వం స్పందించాలని, చనిపోయిన వ్యక్తులకు సముచిత గౌరవంతో అంత్యక్రియలు నిర్వహించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
First published: July 2, 2020, 12:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading