Covid-19 Poverty: 31 మిలియన్ల మందిని కటిక పేదరికంలోకి నెట్టిన కరోనా.. తాజా నివేదికలో విస్తుపోయే నిజాలు..

ప్రతీకాత్మక చిత్రం

కోవిడ్(Covid) కారణంగా ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం తలెత్తింది. కరోనా విజృంభణ తర్వాత చాలా దేశాల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ మహమ్మారి సమయంలో పేద, మధ్యతరగతి ప్రజలు ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 2019తో పోలిస్తే 2020లో 31 మిలియన్ల మంది కొత్తగా కటిక పేదరికంలోకి వెళ్లారని గోల్‌కీపర్స్ వార్షిక నివేదిక వెల్లడించింది.

  • Share this:
కోవిడ్(Covid) కారణంగా ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం తలెత్తింది. కరోనా విజృంభణ తర్వాత చాలా దేశాల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ మహమ్మారి సమయంలో పేద, మధ్యతరగతి ప్రజలు ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 2019తో పోలిస్తే 2020లో 31 మిలియన్ల మంది కొత్తగా కటిక పేదరికంలోకి వెళ్లారని గోల్‌కీపర్స్ వార్షిక నివేదిక వెల్లడించింది. బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ కి చెందిన బిల్ ఫేట్స్, మెలిండా ఫ్రెంచ్ గేట్స్ ఈ నివేదికను రూపొందించారు. ఈ నివేదిక యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్​మెంట్​ గోల్స్ పురోగతిపై కరోనా చూపించే ప్రతికూల ప్రభావాలను వివరించింది.

కరోనాతో తీవ్రంగా దెబ్బతిన్న ప్రజలు కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని నివేదిక తెలిపింది. అధునాతన ఆర్థిక వ్యవస్థల్లో 90 శాతం వరకు వచ్చే ఏడాది నాటికి తలసరి ఆదాయ స్థాయిలను తిరిగి పొందుతాయని నివేదిక పేర్కొంది. తక్కువ, మధ్యస్థ ఆదాయాలు గల ఆర్థిక వ్యవస్థలలో మూడింట ఒక వంతు మాత్రమే తిరిగి తలసరి ఆదాయ స్థాయిలను చేరుకోగలవని నివేదిక అంచనావేసింది. గడచిన సంవత్సరం పురోగతి సాధ్యమేనని కానీ అనివార్యం కాదని నిరూపించిందని సహా అధ్యక్షులు అభిప్రాయపడ్డారు.

Vaccination Effects: కరోనా టీకాతో రుతుక్ర‌మంలో మార్పులు వస్తాయా..? నిపుణులు ఏం చెబుతున్నారు..


గత 18 నెలల్లో మనం చూసిన ఉత్తమ సేవలను మరింత విస్తరించగలిగితే.. కరోనాని జయించవచ్చని తెలిపారు. ఆరోగ్యం, ఆకలి, వాతావరణ మార్పు వంటి ప్రాథమిక సమస్యలను పరిష్కరించడం కోసం మరోసారి కృషి చేయాలన్నారు. కరోనాతో మహిళలు ఎక్కువగా ఆర్థికంగా కుదేలయ్యారనే అంశాన్ని నివేదిక హైలైట్ చేసింది. అధిక, తక్కువ ఆదాయ దేశాలలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఆర్థికంగా దెబ్బతిన్నారని నివేదిక తెలిపింది. ప్రపంచంలోని ప్రతి మూలలోనూ మహిళలు అవరోధాలను ఎదుర్కొంటారని.. అందువల్ల కరో నా ప్రభావం వారిపై పడే అవకాశం ఎక్కువగా ఉందని మెలిండా పేర్కొన్నారు.

Womens: కరోనా వ్యాక్సిన్​ వల్ల మహిళల్లో పీరియడ్స్‌పై ప్రభావం పడుతుందా..? పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..


పేద దేశాలకు వ్యాక్సిన్​ అందించాలి..
ప్రపంచ వ్యాక్సిన్ కవరేజీలో 7 శాతం పాయింట్లు తగ్గే అవకాశం ఉందని ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (ఐహెచ్ఎంఈ) అంచనా వేసింది. టీకా కవరేజీలో నిష్పక్షపాతం కనిపిస్తోందని ఐహెచ్ఎంఈ అసహనం వ్యక్తం చేసింది. కోవిడ్-19 వ్యాక్సిన్ల కవరేజ్ విషయంలో అసమానతలు ఉండటం విచారించాల్సిన విషయమని బిల్ గేట్స్ అన్నారు.

సంపన్న దేశాలు, కమ్యూనిటీలు కోవిడ్-19 ను పేదవారి రోగంగా పరిగణించే ప్రమాదం ఉందనిఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందితేనే.. కరోనాని అధిగమించొచ్చన్నారు. టీకాలు, ఔషధాలను అభివృద్ధి చేసే విషయంలో పేద దేశాల పరిశోధకులు,తయారీదారులకు అండగా ఉండాలని.. అందుకు స్థానిక భాగస్వాములలో పెట్టుబడి పెట్టాలని నివేదిక కోరింది.
Published by:Veera Babu
First published: