హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

PhonePe: రూ.156 చెల్లిస్తే రూ.50,000 కవరేజీతో కరోనావైరస్ ఇన్స్యూరెన్స్ పాలసీ

PhonePe: రూ.156 చెల్లిస్తే రూ.50,000 కవరేజీతో కరోనావైరస్ ఇన్స్యూరెన్స్ పాలసీ

PhonePe (ప్రతీకాత్మక చిత్రం)

PhonePe (ప్రతీకాత్మక చిత్రం)

PhonePe | కరోనా వైరస్ మహమ్మారి బారిన పడితే ఆర్థికంగా చేయూత పొందేందుకు ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా? ఫోన్‌పే కరోనా వైరస్ ఇన్స్యూరెన్స్ పాలసీ ప్రకటించింది.

కరోనా వైరస్ విజృంభిస్తోంది. భారతదేశంలో కేసుల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో అందరిలో కరోనా వైరస్ భయాలు నెలకొన్నాయి. ఎవరైనా ఈ మహమ్మారి బారినపడి ఆస్పత్రి పాలైతే వారి ఆస్పత్రి ఖర్చుల కోసం ఫోన్‌పే కరోనావైరస్ ఇన్స్యూరెన్స్ పాలసీని ప్రకటించింది. బజాజ్ అల్లియాంజ్ జనరల్ ఇన్స్యూరెన్స్‌తో కలిసి ఈ పాలసీని అందిస్తోంది. రూ.156 చెల్లిస్తే రూ.50,000 కవరేజీ అందిస్తోంది. ఆస్పత్రిలో చేరడానికి ముందు, ఆస్పత్రిలో చేరిన తర్వాత 30 రోజులు ఈ పాలసీ వర్తిస్తుంది. ఇందులో టెస్టులు, మెడిసిన్, కన్సల్టేషన్ లాంటివన్నీ కవర్ అవుతాయి. ఫోన్‌పే యాప్‌లో ఈ పాలసీ తీసుకోవచ్చు. ఎలాంటి పరీక్షలు అవసరం లేదు. పేమెంట్ పూర్తి కాగానే డిజిటల్ పాలసీ జనరేట్ అవుతుంది. అయితే పాలసీ తీసుకున్న తేదీ నుంచి 15 రోజుల తర్వాత కరోనావైరస్ బారినపడ్డవారికి మాత్రమే కవరేజీ వర్తిస్తుంది.

ఉదాహరణకు ఎవరైనా ఈరోజు పాలసీ తీసుకున్నట్టైతే 15 రోజుల తర్వాత నుంచి కవరేజీ మొదలవుతుంది. అంటే 15 రోజుల తర్వాత కరోనా వైరస్ కన్ఫామ్ అయితేనే కవరేజీ పొందొచ్చు. పాలసీ తీసుకున్న 15 రోజుల లోపే కరోనా వైరస్ బారిన పడ్డట్టు తేలిసే కవరేజీ వర్తించదు. ఈ పాలసీ తీసుకోవాలనుకునేవారు ముందుగా నియమనిబంధనలన్నీ పూర్తిగా చదివి పేమెంట్ చేయాలి.

గత నెలలో డిజిటల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ డిజిట్ కూడా కరోనావైరస్ ఇన్స్యూరెన్స్ పాలసీని ప్రకటించింది. రూ.253 ప్రీమియంతో రూ.25,000 కవరేజీ, రూ.507 ప్రీమియంతో రూ.50,000 కవరేజీ, రూ.760 ప్రీమియంతో రూ.75,000 కవరేజీ, రూ.1,014 ప్రీమియంతో రూ.1,00,000 కవరేజీ, రూ.1,267 ప్రీమియంతో రూ.1,25,000 కవరేజీ, రూ.1,520 ప్రీమియంతో రూ.1,50,000 కవరేజీ, రూ.1,774 ప్రీమియంతో రూ.1,75,000 కవరేజీ, రూ.2,027 ప్రీమియంతో రూ.2,00,000 కవరేజీ అందించేలా పాలసీని రూపొందించింది.

ఇవి కూడా చదవండి:

Realme: ఈ రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లు ఉన్నవారికి గుడ్ న్యూస్

Indian Railways: రైలు టికెట్ క్యాన్సిల్ చేశారా? రీఫండ్‌ ఇలా పొందండి

SBI Good News: ఈఎంఐ చెల్లించారా? వెనక్కి తీసుకోండి ఇలా

First published:

Tags: Corona, Corona virus, Coronavirus, Covid-19, Health Insurance, Insurance, Lockdown, PhonePe

ఉత్తమ కథలు