Corona Vaccine: Oxford యూనివర్సిటీ కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్.. 70శాతం రక్షణ ఇవ్వనున్న టీకా

ప్రపంచాన్ని గజగజవణికిస్తున్న కరోనా వ్యాక్సిన్ ను తరిమికొట్టేందుకు శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ఫైజర్, మోడర్నా వంటి టీకాలు మంచి ఫలితాలు సాధించగా.. తాజాగా ఆక్స్ఫర్డ్ టీకా కూడా ఆశించిన ఫలితాలను రాబడుతున్నది.

news18
Updated: November 23, 2020, 5:09 PM IST
Corona Vaccine: Oxford యూనివర్సిటీ కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్.. 70శాతం రక్షణ ఇవ్వనున్న టీకా
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: November 23, 2020, 5:09 PM IST
  • Share this:
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన కరోనావైరస్ వ్యాక్సిన్ 70 శాతం సమర్థవంతంగా పనిచేస్తుందని పరిశోధకులు ప్రకటించారు. విస్తృతంగా నిర్వహించిన ట్రయల్స్ ద్వారా ఈ విషయాలు తెలిశాయని వారు తెలిపారు. ఫైజర్, మోడెర్నా సంస్థలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లు 95 శాతం రక్షణను అందిస్తాయని తాజాగా ఆ సంస్థలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఆక్స్‌ఫర్డ్ టీకా ఫలితాలు వెలువడ్డాయి. ఫైజర్, మోడెర్నా సంస్థలతో పోలిస్తే ఈ టీకాను ప్రపంచంలోని ప్రతి మూలకూ తీసుకెళ్లి భద్రంగా నిల్వ చేయవచ్చు. ఈ వ్యాక్సిన్ ధర కూడా చాలా తక్కువ. అందువల్ల మహమ్మారిని నివారించడంలో ఇప్పటికీ ఈ వ్యాక్సిన్ ముఖ్యమైన పాత్ర పోషించగలదు. డోస్‌లో మార్పులు చేస్తే ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ 90 శాతం వరకు రక్షణ అందించే అవకాశం ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఆక్స్‌ఫర్డ్ పరిశోధకులు 10 నెలలుగా ఈ వ్యాక్సిన్‌పై పనిచేస్తున్నారు. వైరస్‌ను నిరోధించడానికి ఈ వ్యాక్సిన్‌ను వాడవచ్చని యూనివర్సిటీ ప్రొఫెసర్ సారా గిల్బర్ట్ చెప్పారు. బ్రిటన్ ప్రభుత్వం ఇప్పటికే ముందస్తుగా 100 మిలియన్ల వ్యాక్సిన్ డోసులను ఆర్డర్ చేసింది. వీటిని 50 మిలియన్ల మందికి ఇవ్వాలని ఆ దేశం ప్రణాళికలు వేస్తోంది.

ట్రయల్స్‌లో ఏం తేలింది?
ఈ వ్యాక్సిన్ ట్రయల్స్‌లో 20,000 మందికి పైగా వాలంటీర్లు పాల్గొన్నారు. వీరిలో సగం మంది బ్రిటన్ వాసులు కాగా, మిగిలినవారు బ్రెజిల్ దేశస్థులు. రెండు డోసుల వ్యాక్సిన్ ఇచ్చిన వాలంటీర్లలో సుమారు 30 కరోనా పాజిటివ్ కేసులు, డమ్మీ ఇంజెక్షన్ పొందిన వ్యక్తులలో 101 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో వ్యాక్సిన్ 70 శాతం రక్షణను ఇవ్వగలదని పరిశోధకులు నిర్ధారించారు. వాలంటీర్లకు రెండుసార్లు హై డోస్ (two high doses) ఇచ్చినప్పుడు రక్షణ 62 శాతంగా నమోదైంది. కానీ ఒక హై డోస్, ఒక లో డోస్ (తక్కువ డోస్) ఇచ్చినప్పుడు ఇది 90 శాతానికి పెరిగింది. ఈ తేడాలు ఎందుకు వచ్చాయనే అంశంపై స్పష్టమైన సమాచారాన్ని వెల్లడించలేదు. ఈ ఫలితాలతో తాము సంతోషిస్తున్నామని ప్రధాన పరిశోధకుడు ప్రొఫెసర్ ఆండ్రూ పొలార్డ్ చెబుతున్నారు.

ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?
ప్రస్తుతం బ్రిటన్‌లో నాలుగు మిలియన్ డోస్‌ (నలభై లక్షల) లు సిద్ధంగా ఉన్నాయి. మరో 96 మిలియన్ల డోసులను త్వరలోనే సిద్ధం చేయనున్నారు. వ్యాక్సిన్ భద్రత, ప్రభావాన్ని అంచనా వేసే రెగ్యులేటర్లు ఆమోదిస్తేనే దీన్ని పంపిణీ చేస్తారు. ఈ ప్రక్రియకు మరికొన్ని వారాల సమయం పట్టే అవకాశం ఉంది. వీటి పంపిణీకి బ్రిటన్ ప్రభుత్వం త్వరలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. టీకా పంపిణీలో ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ కార్మికులు, వృద్ధులకు మొదటి ప్రాధాన్యం ఇస్తారు.

వ్యాక్సిన్ ఎలా పని చేస్తుంది?

పరిశోధకులు చింపాంజీలకు సోకే కామన్ కోల్డ్ వైరస్‌కు జన్యుపరమైన మార్పులు చేసి, దానికి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. ఈ వైరస్ స్పైక్ ప్రోటీన్లు ఉండే కరోనావైరస్‌ను పోలి ఉంటుంది. ఇది మానవ శరీరంలోకి వెళ్తే స్పైక్ ప్రోటీన్ ఉత్పత్తిని ప్రారంభిస్తుంది. ఆరోగ్యానికి కారణమయ్యే ఇలాంటి వాటిని మన రోగనిరోధక వ్యవస్థ నిర్మూలిస్తుంది.

ఫలితాలు నిరాశపరిచాయా?
ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్‌లు కోవిడ్-19 నుంచి 95 శాతం రక్షణను అందిస్తాయని ఇటీవల ప్రకటించాయి. దీంతో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ 70 శాతం రక్షణనిస్తుందనే ప్రకటన నిరాశపరిచేదేనని చెప్పుకోవచ్చు. కానీ 50 శాతం కంటే ఎక్కువ రక్షణ ఇచ్చే వ్యాక్సిన్ ఏదైనా మంచిదేనని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్‌ను ఫ్రిజ్‌ ఉష్ణోగ్రత వద్ద కూడా నిల్వ చేయవచ్చు. ఫైజర్, బయోఎంటెక్, మెడెర్నా వ్యాక్సిన్‌లను ఇలా నిల్వ చేయలేరు. వీటిని చాలా చల్లటి ఉష్ణోగ్రతలలో నిల్వ చేయాలి. అందువల్ల ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌ను ప్రపంచంలోని ప్రతి మూలకు సులభంగా, అతి తక్కువ ధరల్లోనే పంపిణీ చేయవచ్చు.
Published by: Srinivas Munigala
First published: November 23, 2020, 5:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading