హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

సీఎం అయినా ఆ సర్టిఫికెట్ ఉండాల్సిందే.. ఆ రాష్ట్ర స్పీకర్‌ కీలక నిర్ణయం

సీఎం అయినా ఆ సర్టిఫికెట్ ఉండాల్సిందే.. ఆ రాష్ట్ర స్పీకర్‌ కీలక నిర్ణయం

హర్యానా స్పీకర్ జ్ఞాన్ చంద్ గుప్తా(ఫైల్ ఫోటో)

హర్యానా స్పీకర్ జ్ఞాన్ చంద్ గుప్తా(ఫైల్ ఫోటో)

కరోనా నెగటివ్ పరీక్షలకు సంబంధించిన టెస్ట్ రిపోర్ట్.. సమావేశాలకు మూడు రోజుల ముందు తీసుకున్నది అయి ఉండాలని స్పీకర్ తెలిపారు. తెలిపారు.

కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి చాలా రాష్ట్రాలు. ఈ క్రమంలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమైన హర్యానా అసెంబ్లీ స్పీకర్ జ్ఞాన్ చంద్ గుప్తా.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ లేకుండా ఎవరూ అసెంబ్లీ పరిసరాల్లోకి అడుగుపెట్టకూడదని ఆయన స్పష్టం చేశారు. మీడియా ప్రతినిధులు, భద్రతా సిబ్బంది, ఎమ్మెల్యే, మంత్రులు, ముఖ్యమంత్రికి కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని తేల్చిచెప్పారు. కరోనా నెగిటివ్ సర్టిఫికెట్‌తో పాటు చైనాలో తయారైన శానిటైజర్లు మాస్కుల లేనట్టయితేనే అసెంబ్లీలోకి అనుమతి ఇస్తామని క్లారిటీ ఇచ్చారు.

అంతేకాదు కరోనా నెగటివ్ పరీక్షలకు సంబంధించిన టెస్ట్ రిపోర్ట్.. సమావేశాలకు మూడు రోజుల ముందు తీసుకున్నది అయి ఉండాలని తెలిపారు. వీటితో పాటు అసెంబ్లీకి వచ్చే ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఆరోగ్యసేతు యాప్‌ను ఉపయోగించాలని అన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కూర్చునే చోట శానిటైజర్ సహా కరోనా నివారణకు తీసుకునే ఉత్పత్తులను అందించబోతున్నట్టు తెలిపారు.

First published:

Tags: Coronavirus, Haryana

ఉత్తమ కథలు