news18-telugu
Updated: October 19, 2020, 5:14 PM IST
ప్రతీకాత్మకచిత్రం
కోవిడ్ ను పూర్తి స్థాయిలో కాకపోయిన దాని తీవ్రత తగ్గించేందుకు కొత్త తరహా మందులను కని పెట్టెందుకు హైదరాబాద్ కు చెందిన పలు ఫార్మాసిటకల్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే భారత్ బయోటెక్ లాంటి సంస్థలు కోవిడ్ కు వాక్సిన్ ను కనుగొనే ప్రయత్నంలో ఉంటే, ఇప్పుడు మరో సంస్థ కోవిడ్ వ్యాధిని గుర్తించడానికి కనిపించే ప్రదానమైన ఫ్లూ లక్షణాలను నివారించడానికి ఒక కొత్త ఔషధాన్ని మార్కెట్ లో విడుదల చేశారు. నగరానికి చెందిని ‘లీ హెల్త్ డొమెయిన్’ ఫ్లూ నివారణకు స్టీమ్ మంత్ర, రోల్ ఆన్ కోల్డ్ పేరుతో ఆయుర్వేద ఉత్పత్తులను మార్కెట్ లోకి విడుదల చేసింది. ఫ్లూ కారణంగా వచ్చే జలుబు, దగ్గు, గొంతు నొప్పి సమస్యకు ఇవి చక్కని పరిష్కారాన్ని చూపిస్తాయని ఆ సంస్థ ప్రతినిధులు అంటున్నారు.
ఆయుర్వేద గ్రంధాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా పరిశోధన అనంతరం వీటిని ప్రవేశపెట్టినట్టు కంపెనీ డైరెక్టర్ లీలా రాణి తెలిపారు. స్టీమ్ మంత్ర చుక్కలను వేడి నీళ్లలో వేసి ఆవిరి పట్టడం లేదా రోల్ ఆన్ కోల్డ్‌ను నుదురు, కణత, గొంతుపై రాయడం ద్వారా సత్వర ఉపశమనం ఉంటుందని చెప్పారు. కాంబో ప్యాక్ ధర రూ.135 ఉంది. ఆన్‌లైన్‌తోపాటు మందుల షాపుల్లో లభిస్తుంది.
Published by:
Krishna Adithya
First published:
October 19, 2020, 5:14 PM IST