యూపీలో కరోనా కరళనృత్యం...మంత్రిని బలిగొన్న మహమ్మారి

Covid-19 Latest Updates: ఉత్తర ప్రదేశ్ మంత్రి కమల్ రాణి వరుణ్ కరోనా కాటుకు బలయ్యారు. ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో ఆమె సాంకేతిక విద్యా శాఖ మంత్రిగా సేవలందిస్తూ వచ్చారు.

news18-telugu
Updated: August 2, 2020, 11:57 AM IST
యూపీలో కరోనా కరళనృత్యం...మంత్రిని బలిగొన్న మహమ్మారి
కరోనా కాటుకు బలైన యూపీ మంత్రి కమల్ రాణి వరుణ్(ఫైల్ ఫోటో)
  • Share this:
ఉత్తర ప్రదేశ్ మంత్రి కమల్ రాణి వరుణ్ కరోనా కాటుకు బలయ్యారు. యోగి ఆదిత్యనాథ్ కేబినెట్‌లో సభ్యురాలైన కమల్ రాణి వరుణ్‌కు గత నెల 18న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణకావడంతో లక్నోలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. గత రెండు వారాలుగా ప్రాణాంతక కరోనాతో పోరాడుతూ వచ్చిన ఆమె...ఆదివారం ఉదయం చికిత్సా ఫలితం లేకుండా కన్నుమూశారు. ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో ఆమె సాంకేతిక విద్యా శాఖ మంత్రిగా సేవలందిస్తూ వచ్చారు.

మంత్రి కమల్ రాణి వరుణ్ మరణం పట్ల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తంచేశారు. ఆమె కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఆమె అందించిన ప్రజా, సామాజిక సేవలను కొనియాడారు. మంత్రిగా ఆమె సమర్థవంతంగా పనిచేశారని పేర్కొన్నారు.




యూపీలో కరోనా కరళ నృత్యం చేస్తోంది. సామాన్యుల నుంచి ప్రముఖ వ్యక్తుల వరకు అందరూ కరోనా బారినపడుతున్నారు. కొందరు కరోనాను జయిస్తుంటే...మరికొందరు కరోనాతో పోరాడి ప్రాణాలు విడుస్తున్నారు. రెండు వారాల క్రితం యూపీ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి, సమాజ్‌వాది పార్టీ సీనియర్ నేత ఘారా రామ్ కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.కరోనా కారణంగా యూపీలో శనివారం ఒక్కరోజే 47 మంది మరణించగా...ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,677కి చేరింది. గత 24 గం.ల్లో 3,587 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణకావడంతో మొత్తం కేసుల సంఖ్య 89,048కి చేరింది. 36,037 యాక్టివ్ కేసులు ఉండగా...51,334 మంది కరోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల పరంగా దేశంలో యూపీ ఐదో స్థానంలో ఉంది.
Published by: Janardhan V
First published: August 2, 2020, 11:57 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading