గబ్బిలాలు కరోనాను ఎలా జయిస్తున్నాయి? శాస్త్రవేత్తల తాజా పరిశోధన...

రకరకాల వ్యాధుల్ని కలిగించే వైరస్‌లు గబ్బిలాలపై ఉంటాయి. కానీ... అవేవీ గబ్బిలాల్ని ఏమీ చెయ్యలేకపోతున్నాయి. ఇదెలా సాధ్యమవుతోంది?

news18-telugu
Updated: July 13, 2020, 1:37 PM IST
గబ్బిలాలు కరోనాను ఎలా జయిస్తున్నాయి? శాస్త్రవేత్తల తాజా పరిశోధన...
గబ్బిలాలు కరోనాను ఎలా జయిస్తున్నాయి? శాస్త్రవేత్తల తాజా పరిశోధన...
  • Share this:
కరోనా వైరస్‌తో ప్రపంచ మానవాళి అల్లాడిపోతోంది. కానీ... ఆ వైరస్‌... మనుషులతోపాటూ... గబ్బిలాలపైనా దాడి చేస్తోంది. మనుషులు చనిపోవడమో, నీరసపడటమో జరుగుతోంది గానీ... గబ్బిలాలకు ఏ చిన్న అనారోగ్యమూ రావట్లేదు. కరోనాయే కాదు... ఎబోలా, ర్యాబిస్, సార్స్, ఇలా చాలా వైరస్‌లు గబ్బిలాలపై ఉంటాయి. పైగా అవి గుంపులుగా ఉంటాయి. అందువల్ల ఒక గబ్బిలానికి వైరస్ వస్తే... అది మిగతా వాటికీ చేరుతుంది. అందువల్ల అన్ని గబ్బిలాలకూ రకరకాల వైరస్‌లు ఉంటాయి. కానీ ఆ వైరస్‌లను అవి తట్టుకోగలుగుతున్నాయి. అందుకే... ఆ పరిమాణంలో ఉండే మిగతా ప్రాణుల కంటే గబ్బిలాలు ఎక్కువ కాలం జీవిస్తున్నాయి.

అమెరికాలోని రోచెస్టర్ యూనివర్శిటీ పరిశోధకుల ప్రకారం... గబ్బిలాలకు వేడిని కంట్రోల్ చేసుకునే లక్షణం ఉందని తెలిసింది. సాధారణంగా... వైరస్‌లు దాడి చేయగానే... మన బాడీలో వేడి పెరిగి... జ్వరం వస్తుంది. వేడి పెరిగేకొద్దీ మనకు ప్రమాదమే. గబ్బిలాలకూ అలా జరిగే ఛాన్స్ ఉన్నా... అవి వేడిని పెరగనివ్వకుండా చేసుకోగలుగుతున్నాయి. సెల్ మెటబాలిజమ్ అనే జర్నల్‌లో తమ అధ్యయనం వివరాల్ని రాశారు. ఇలాంటి అధ్యయన వివరాలతో... మున్ముందు మనం ఎలాంటి ట్రీట్‌మెంట్స్ పాటించాలో తెలిసే ఛాన్సుంది.

వాళ్ల పరిశోధన ప్రకారం... గబ్బిలాలు... వైరస్‌లు పెరగకుండా అడ్డుకోగలుగుతున్నాయి. వాటి సంఖ్యను పరిమితం చెయ్యగలుగుతున్నాయి. వైరస్ సోకినప్పుడు... దాన్ని తమ వ్యాధినిరోధక శక్తితో బలంగా తిప్పికొడుతున్నాయి. ఇలా బలంగా తిప్పికొట్టేటప్పుడు మనకైతే... జ్వరం వస్తుంది. గబ్బిలాలు మాత్రం ఆ జ్వరం రాకుండా చేసుకోగలుగుతున్నాయి. పైగా... గబ్బిలాలపై రోజూ రకరకాల వైరస్‌ల దాడి ఉంటూనే ఉంటుంది. అందువల్ల వాటి శరీరంలో వ్యాధి నిరోధక శక్తి ఎప్పటికప్పుడు బలంగా తయారవుతోంది. అందుకే అవి కరోనాను కూడా తట్టుకోగలుగుతున్నాయంటున్నారు.

కరోనాను మానవులు తట్టుకునే స్థాయికి మనుషుల వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే... కొన్నేళ్లు పడుతుందంటున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పటికే మనం దానితో బాగానే పోరాడుతున్నామనీ... క్రమంగా వైరస్ వల్ల మరణాల్లో జోరు తగ్గుతోందని చెబుతున్నారు.
Published by: Krishna Kumar N
First published: July 13, 2020, 1:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading