Covid-19 India Updates: కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసుల్లో టాప్-5 రాష్ట్రాలు ఇవే

Covid-19 India updates | Covid-19 Top-5 States in India | దేశంలో కరోనా విజృంభిస్తోంది. దేశంలో ఇప్పటి వరకు నమోదైన కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 9 లక్షలు దాటింది. కొత్తగా నమోదైన కోవిడ్-19 కేసుల పరంగా టాప్-5 రాష్ట్రాలు ఇవే.

news18-telugu
Updated: July 14, 2020, 11:14 AM IST
Covid-19 India Updates: కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసుల్లో టాప్-5 రాష్ట్రాలు ఇవే
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 9 లక్షలు దాటింది. కేవలం 3 రోజుల వ్యవధిలోనే కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 8 లక్షల నుంచి 9 లక్షలకు చేరుకుంది. దేశంలో గత 24 గంటల్లో నమోదైన కొత్త కేసులు (28,498) కలుపుకుని మొత్తం కేసుల సంఖ్య 9,06,752కు చేరింది. వీరిలో 5,71,459 మంది కోవిడ్‌-19 నుంచి కోలుకోగా...యాక్టివ్ కేసుల సంఖ్య 3,11,565గా ఉంది. దేశంలో గత 24 గంటల్లో నమోదైన కొత్త కోవిడ్ పాజిటివ్ కేసుల్లో 39 శాతం కేసులు దేశ దక్షిణాది రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. అటు దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 23,727కి చేరింది. గత 24 గంటల్లోనే దేశంలో 553 మంది మృతి చెందారు. కోవిడ్-19 కారణంగా ప్రపంచంలో నమోదవుతున్న మరణాల రేటు 4.35గా ఉండగా...ఇది మన దేశంలో 2.6 శాతంగా ఉండటం ఊరట కలిగించే అంశం.

కొత్తగా నమోదవుతున్న కోవిడ్-19 పాజిటివ్ కేసుల్లో టాప్-5 రాష్ట్రాలు ఇవే..

1.మహారాష్ట్ర(6,497 కేసులు)
కొత్తగా నమోదవుతున్న కోవిడ్-19 కేసుల పరంగా మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలుస్తోంది. ఆ రాష్ట్రంలో కొత్తగా 6,497 కేసులు నమోదుకాగా...మొత్తం కేసుల సంఖ్య 2,60,924కు చేరుకుంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 1,05,935 కేసులు యాక్టివ్‌గా ఉండగా...1,44,507 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 193 మంది మరణించగా...ఆ రాష్ట్రంలో మొత్తం కోవిడ్-19 మరణాల సంఖ్య 10,482కు చేరుకుంది. మరణాల రేటు అక్కడ 4 శాతంగా ఉంది.

2. తమిళనాడు(4,328)
కొత్తగా నమోదవుతున్న కోవిడ్-19 కేసుల పరంగా తమిళనాడు రెండో స్థానంలో నిలుస్తోంది. ఆ రాష్ట్రంలో కొత్తగా 4,328 కేసులు నమోదుకాగా...మొత్తం కేసుల సంఖ్య 1,42,798కి చేరుకుంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 48,199 యాక్టి్వ్ కేసులు ఉండగా...92,567 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 66 మంది మరణించగా...ఆ రాష్ట్రంలో మొత్తం కోవిడ్-19 మరణాల సంఖ్య 2,032కు చేరుకుంది.

3.కర్ణాటక(2,738)కొత్తగా నమోదవుతున్న కోవిడ్-19 కేసుల పరంగా కర్ణాటక మూడో స్థానంలో నిలుస్తోంది. ఆ రాష్ట్రంలో కొత్తగా 2,738 కేసులు నమోదుకాగా...మొత్తం కేసుల సంఖ్య 41,581కి చేరుకుంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 24,576 యాక్టి్వ్ కేసులు ఉండగా...16,248 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో ఆ రాష్ట్రంలో 73 మంది మరణించగా...ఆ రాష్ట్రంలో మొత్తం కోవిడ్-19 మరణాల సంఖ్య 757కు చేరుకుంది.

4. ఆంధ్రప్రదేశ్ (1,935)
కొత్తగా నమోదవుతున్న కోవిడ్-19 కేసుల పరంగా ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో నిలుస్తోంది. ఆ రాష్ట్రంలో కొత్తగా 1935 కేసులు నమోదుకాగా...మొత్తం కేసుల సంఖ్య 31,103కి చేరుకుంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 14,274 యాక్టి్వ్ కేసులు ఉండగా...16,464 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో ఏపీలో 37 మంది మరణించగా...ఆ రాష్ట్రంలో మొత్తం కోవిడ్-19 మరణాల సంఖ్య 365కు చేరుకుంది.

5.ఉత్తరప్రదేశ్ (1,654)
కొత్తగా నమోదవుతున్న కోవిడ్-19 కేసుల పరంగా ఉత్తర ప్రదేశ్ ఐదో స్థానంలో నిలుస్తోంది. ఆ రాష్ట్రంలో కొత్తగా 1,654 కేసులు నమోదుకాగా...మొత్తం కేసుల సంఖ్య 38,130కి చేరుకుంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 12,972 యాక్టి్వ్ కేసులు ఉండగా...24,203 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో ఆ రాష్ట్రంలో 21 మంది మరణించగా...ఆ రాష్ట్రంలో మొత్తం కోవిడ్-19 మరణాల సంఖ్య 955కు చేరుకుంది.

covid19 india updates, covid19 india new cases, covid19 top 5 states, covid19 india updates, covid19 india latest news, coronavirus latest news, కోవిడ్ 19 వార్తలు, కోవిడ్19 ఇండియా, కరోనా వైరస్ వార్తలు, కరోనా వైరస్ వ్యాక్సిన్, కరోనా వైరస్ టాప్5 రాష్ట్రాలు
దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేవిడ్ కేసుల వివరాలు


కొత్తగా నమోదవుతున్న కోవిడ్-19 పాజిటివ్ కేసుల పరంగా ఆరో స్థానంలో తెలంగాణ(1,550), ఏడో స్థానంలో పశ్చిమ బెంగాల్(1,435), ఎనిమిదో స్థానంలో బీహార్(1,317), 9వ స్థానంలో ఢిల్లీ(1246), 10వ స్థానంలో గుజరాత్(902) ఉన్నాయి.

ప్రపంచంలో 3వ స్థానంలో భారత్..
ప్రపంచంలో అత్యధికంగా నమోదైన కోవిడ్-19 కేసుల పరంగా భారత్ మూడో స్థానంలో నిలుస్తోంది.

covid19 india updates, covid19 india new cases, covid19 top 5 states, covid19 india updates, covid19 india latest news, coronavirus latest news, కోవిడ్ 19 వార్తలు, కోవిడ్19 ఇండియా, కరోనా వైరస్ వార్తలు, కరోనా వైరస్ వ్యాక్సిన్, కరోనా వైరస్ టాప్5 రాష్ట్రాలు
ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసులు, మరణాల వివరాలు


ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల్లో ఇప్పటి వరకు నమోదైన కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 1,32,38,121కి చేరుకుంది. 34,79,483 పాజిట్ కేసులతో అమెరికా అగ్రస్థానంలో నిలుస్తుండగా...18,87,959 కేసులతో బ్రెజిల్ రెండో స్థానంలో...9,06,752 కేసులతో భారత్ మూడో స్థానంలో నిలుస్తోంది.
Published by: Janardhan V
First published: July 14, 2020, 11:14 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading