హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Covid Update : కరోనాపై భారత్ అతిపెద్ద విజయం..దేశం నుంచి కోవిడ్ పరార్!

Covid Update : కరోనాపై భారత్ అతిపెద్ద విజయం..దేశం నుంచి కోవిడ్ పరార్!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Covid cases in india : రెండున్నరేళ్లుగా ప్రపంచాన్ని కరోనా వైరస్(Corona Virus)పట్టిపీడిస్తోంది. ఇప్పటికీ ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా కేసుల సంఖ్య భారీగానే ఉంటున్న విషయం తెలిసిందే.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Covid cases in india : రెండున్నరేళ్లుగా ప్రపంచాన్ని కరోనా వైరస్(Corona Virus)పట్టిపీడిస్తోంది. ఇప్పటికీ ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా కేసుల సంఖ్య భారీగానే ఉంటున్న విషయం తెలిసిందే. అయితే భారత్(India) లో మాత్రం కరోనా కేసులు(Corona Cases)తగ్గిపోతున్నాయి. బుధవారం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా కొత్తగా 2529 కరోనా వైరస్ కేసులు,12మరణాలు(Covid Deaths)నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. తాజా కేసులు,మరణాలతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,46,04,463కు,మొత్తం మరణాల సంఖ్య 5,28,745కు చేరింది.

దేశంలో గడిచిన 24 గంటల్లో 3553 మంది కోవిడ్ నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,40,43,436 చేరుకుంది. బుధవారం దేశంలో 1,22,057మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా..ఇప్పటివరకు 89.62కోట్ల మందికి కోవిడ్ టెస్ట్ లు నిర్వహించారు.

భారత్ జోడో యాత్రలో పాల్గొన్న సోనియా..రాహుల్ చెయ్యి పట్టుకుని నడిచిన కాంగ్రెస్ అధినేత్రి

దేశంలో ప్రస్తుతం 32,282 యాక్టివ్‌ కోవిడ్ కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల్లో 0.O7 శాతం కేసులు యాక్టివ్‌ గా ఉండగా, రికవరీ రేటు 98.74శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక,దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. దేశంలో బుధవారం 79,366 మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 218.84 కోట్లకు చేరింది.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Corona alert, Corona casess, Covid-19, COVID-19 vaccine

ఉత్తమ కథలు