India Covid Cases : రెండున్నరేళ్లుగా ప్రపంచాన్ని కరోనా వైరస్(Corona Virus)పట్టిపీడిస్తోంది. ఇప్పటికీ ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా కేసుల సంఖ్య భారీగానే ఉంటున్న విషయం తెలిసిందే. అయితే భారత్(India) లో మాత్రం కరోనా కేసులు(Corona Cases)తగ్గిపోతున్నాయి. సోమవారం నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా కొత్తగా 1957 కరోనా వైరస్ కేసులు,8మరణాలు(Covid Deaths)నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. తాజా కేసులు,మరణాలతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,46,16,394కు,మొత్తం మరణాల సంఖ్య 5,28,822కు చేరింది. ఇక,దేశవ్యాప్తంగా డైలీ పాజిటివిటీ రేటు 0.71శాతంగా,వీక్లీ పాజిటివిటీ రేటు 1.21శాతంగా ఉంది.
దేశంలో గడిచిన 24 గంటల్లో 2654 మంది కోవిడ్ నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,40,60,198కు చేరుకుంది. రికవరీ రేటు 98.75శాతంగా ఉంది. సోమవారం దేశంలో 2,76,125మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా..ఇప్పటివరకు 89.74కోట్ల మందికి కోవిడ్ టెస్ట్ లు నిర్వహించారు.
Army Dog : రెండు బుల్లెట్లు తగిలినా తగ్గలే..ఉగ్రవాదులు చచ్చేదాకా వదిలిపెట్టని ఆర్మీ డాగ్
దేశంలో ప్రస్తుతం 27,374 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల్లో 0.O6 శాతం కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక,దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. దేశంలో సోమవారం 5,03,576 మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 219.04 కోట్లకు చేరింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona alert, Corona deaths, Covid cases, Covid-19, COVID-19 vaccine