news18-telugu
Updated: July 31, 2020, 11:26 AM IST
Airlines: ఫ్లైట్ ఎక్కే వారికి ఆఫర్స్... ఫుల్ బాడీ చెకప్, ఇన్స్యూరెన్స్ ఉచితం
(ప్రతీకాత్మక చిత్రం)
మీరు ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తున్నారా? గతంలో ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తే క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ లాంటి ఆఫర్స్ ఉండేవి. కానీ ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావంతో సీన్ మారిపోయింది. ఆఫర్స్ కూడా మారాయి. ప్రస్తుతం ఎయిర్‌లైన్స్ డాక్టర్ కన్సల్టేషన్ పైన డిస్కౌంట్స్, ఇన్స్యూరెన్స్ కవర్, ఫుల్ బాడీ చెకప్ లాంటి ఆఫర్స్‌ను ప్రయాణికులకు అందిస్తున్నాయి. అంతేకాదు... కోవిడ్ 19 వారియర్స్‌గా సేవలు అందించిన డాక్టర్లు, నర్సులకు కూడా ఎయిర్‌లైన్స్ ప్రత్యేక ఆఫర్స్‌ను ప్రకటించడం విశేషం. భారతదేశంలో డొమెస్టిక్ ఫ్లై సర్వీసులు మే 25న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఎయిర్‌లైన్స్ సేవలు ప్రారంభమయ్యాయి కానీ... ప్రయాణికుల రాక తగ్గిపోయింది.
ప్రస్తుతం అన్ని ఎయిర్‌లైన్స్‌లో కెపాసిటీ యుటిలైజేషన్ కేవలం 30 శాతం మాత్రమే. ప్రస్తుతం ఎమర్జెన్సీ ట్రావెల్‌కు మాత్రమే డిమాండ్ ఉందని, 90 శాతం బుకింగ్స్ వన్ వే ట్రిప్స్ ఉన్నాయని, 80 శాతం బుకింగ్స్ రాబోయే రెండు వారాల్లోనే ఉన్నాయని క్లియర్‌ట్రిప్ ఎయిర్ బిజినెస్ గ్లోబల్ హెడ్ బాలు రామచంద్రన్ మనీకంట్రోల్‌కు తెలిపారు. ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేవారి సంఖ్య తక్కువగా ఉండటంతో ఎయిర్‌లైన్స్ పలు ఆఫర్స్‌ను ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా కోవిడ్ 19 భయాలు ఉండటంతో ఆరోగ్యం, భద్రత అంశాలకు సంబంధించిన ఆఫర్స్ ఉంటున్నాయి.
August 2020 Bank Holidays: ఆగస్టులో బ్యాంకులకు 10 సెలవులు... ఎప్పుడంటే
Aadhaar card: ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేయండిలా
గోఎయిర్ ఎయిర్‌లైన్స్ ప్రతీ బుకింగ్‌పై ఆన్‌లైన్ డాక్టర్ కన్సల్టేషన్ ప్యాకేజీలను ప్రకటించింది. ఫుల్ బాడీ చెకప్స్ కూడా ఆఫర్ చేస్తోంది. స్పైస్ జెట్ ఎయిర్‌లైన్స్ ఇన్స్యూరెన్స్ సంస్థ డిజిట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. కోవిడ్ 19 కవరేజీ అందిస్తోంది. ప్రీమియం రూ.443 నుంచి రూ.1,564 మధ్య ఉంటుంది. ఇక ఇండిగో ఎయిర్‌లైన్స్ డాక్టర్లు, నర్సులకు 25 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఆఫర్ 2020 డిసెంబర్ 31 వరకు ఉంటుంది.
గాల్వాన్ లోయలో భారత సైనికుల పోరాటాన్ని గుర్తిస్తూ సాయుధ బలగాలకు కూడా ఆఫర్స్ అందిస్తున్నాయి కంపెనీలు. ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ, నేవీ, పారా మిలిటరీ బలగాలు, కోస్డ్ గార్డ్, ట్రైనీ క్యాడెట్, వెటరన్స్‌కు ప్రత్యేక ఆఫర్స్ ప్రకటించింది ట్రావెల్ పోర్టల్ ఈజీ మై ట్రిప్. ఇక విస్తారా ఎయిర్‌లైన్స్ బిజినెస్, ప్రీమియం ఎకనమీ కేటగిరీ ప్రయాణికులకు స్టార్ బక్స్ కాఫీపై ఆఫర్స్ చేస్తోంది. విస్తారా బోర్డింగ్ పాస్ చూపించి స్టార్ బక్స్ స్టోర్‌లో 20 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చు.
Published by:
Santhosh Kumar S
First published:
July 31, 2020, 11:26 AM IST