Covid Vaccine: కరోనా వ్యాక్సిన్‌పై కేంద్ర మంత్రి హర్షవర్దన్ కీలక ప్రకటన

COVID-19: కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలతో పాటు భారతీయులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ కమ్రంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్(Union Health Minister Harsh vardhan) కీలక ప్రటకన చేశారు.

news18-telugu
Updated: November 30, 2020, 5:44 PM IST
Covid Vaccine: కరోనా వ్యాక్సిన్‌పై కేంద్ర మంత్రి హర్షవర్దన్ కీలక ప్రకటన
కేంద్రమంత్రి హర్షవర్ధన్ (ఫైల్ ఫోటో)
  • Share this:
కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలతో పాటు భారతీయులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ కమ్రంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ కీలక ప్రటకన చేశారు. 2021 ఆగస్టు వరకు దేశంలోని 30 కోట్ల మంది కోవిడ్ వ్యాక్సిన్ అందజేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని ఆయన చెప్పారు. అయితే కరోనాతో పోరాటంలో ప్రతిఒక్కరు నిబంధనలను అనుసరించాల్సిన అవసరాన్ని ఆయన మరోసారి పునరుద్ఘాటించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీ చైర్మన్‌గా కూడా ఉన్న ఆయన సోమవారం ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో మాస్క్‌లు, సబ్బులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఏడాది మధ్య కంటే ముందే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.

"వచ్చే ఏడాది తొలి మూడు నాలుగు నెలల్లోనే మనం దేశంలోని ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందించే అవకాశం ఉంది. జూలై-ఆగస్టు నాటికి సుమారు 25 నుంచి 30 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ అందించే ప్రణాళికలు ఉన్నాయి. అయితే ప్రతి ఒక్కరు కరోనా నియంత్రణ కోసం మాస్క్‌లు ధరించడంతో పాటుగా, సామాజిక దూరం పాటించాలని కోరుతున్నాను. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రధానమైనవి. దేశంలో కరోనా పోరాటం 12 నెలలుగా చేరింది. తొలి నుంచి కరోనాను ఎదుర్కొవడంలో మాస్క్‌లు, శానిటైజర్ మనవద్ద ఉన్న అతిపెద్ద ఆయుధాలు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో అత్యధిక కరోనా రికవరీ రేటు ఉంది. ఈ ఏడాది జనవరిలో మన దగ్గర కరోనా పరీక్షల కోసం ఒక్కటే ల్యాబొరేటరీ ఉంది.. కానీ ఇప్పుడు 2,165 ల్యాబ్‌లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ప్రతి రోజు 10 లక్షల శాంపిల్స్‌ను పరీక్షిస్తున్నారు. కరోనాకు వ్యాక్సిన్ తీసుకురావడానికి శాస్త్రవేత్తలు కూడా తీవ్రంగా కృషి చేస్తున్నారు" అని తెలిపారు.

ఇక, భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 38,772 కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 94 లక్షలు దాటింది. కరోనాతో తాజాగా 443 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,37,139కి చేరింది. మరోవైపు ఇటీవల దేశంలో కరోనా వ్యాక్సిన్ అభివృద్ది చేస్తున్న మూడు సంస్థలను ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించిన సంగతి తెలిసిందే. అక్కడ శాస్త్రవేత్తలతో వ్యాక్సిన్ల పురోగతిపై ఆయన సమీక్ష జరిపారు.
Published by: Sumanth Kanukula
First published: November 30, 2020, 5:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading