COVID-19: గుడ్ న్యూస్.. దేశంలో తగ్గిన ఆర్ వాల్యూ.. ప్రస్తుతం ఎంత ఉందంటే..

ప్రతీకాత్మకచిత్రం

ఇది నిజంగానే దేశ ప్రజలకు గుడ్ న్యూస్. దేశంలో కరోనా వ్యాప్తికి సంబంధించి పరిశోధకులు ఊరట కలిగించే వార్తను చెప్పారు.

  • Share this:
    ఇది నిజంగానే దేశ ప్రజలకు గుడ్ న్యూస్. దేశంలో కరోనా వ్యాప్తికి సంబంధించి పరిశోధకులు ఊరట కలిగించే వార్తను చెప్పారు. కరోనా వైరస్(Coronavirus) సంక్రమణ రేటును సూచించే ఆర్‌ ఫ్యాక్టర్‌ గతంతో పోల్చితే తగ్గినట్టుగా పరిశోధకులు వెల్లడించారు. ఇన్‌ఫెక్షన్‌ సోకిన వారి నుంచి ఇతరులకు వైరస్‌ ఎంతమేరకు వ్యాప్తి చెందుతుందో తెలిపే ప్రామాణిక సంఖ్య ఆర్‌-వాల్యూ (Reproductive Number)గా చూస్తారు. ఆర్ ఫ్యాక్టర్ ఆగస్టు నెలలో 1.17 ఉండగా.. సెప్టెంబర్ మధ్యనాటికి అది 0.92కి పడిపోయింది. ఇది దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిందనే సంకేతాన్ని ఇస్తుందని పరిశోధకులు తెలిపారు. అయితే దేశంలోని ప్రధాన నగరాలైన చెన్నై, ముంబై, కోల్‌కత్తా, బెంగళూరులలో మాత్రం ఆర్ వాల్యూ.. ఒకటి కంటే పైనే ఉంది. మరోవైపు ఢిల్లీ, పుణె‌లలో ఆర్ వాల్యూ (R-value) ఒకటి కంటే తక్కువగానే ఉందని పరిశోధకులు తెలిపారు.

    ఇక, దేశంలోనే కరోనా కేసులు అధికంగా ఉన్న మహారాష్ట్ర (Maharashtra), కేరళ (Kerala) రాష్ట్రాలలో ఆర్ వాల్యూ 1 కంటే తక్కువగా ఉంది. ఇది ఆ రాష్ట్రాలకు పెద్ద ఊరట కలిగించే అంశమనే చెప్పాలి. ఆగస్టు చివరినాటికి దేశంలో ఆర్ వాల్యూ 1.17గా ఉంది. అది సెప్టెంబర్ 4-7 వరకు 1.11కి క్షీణించింది. ఆ తర్వాత అది ఒకటి కంటే తక్కువకు పడిపోయింది.

    Liquor Shops: తెలంగాణలో మద్యం షాపుల కేటాయింపుల్లో రిజర్వేషన్లు.. జీవో జారీ.. పూర్తి వివరాలు ఇవే..

    ‘గుడ్ న్యూస్.. ఇండియాలో ఆర్ వాల్యూ ఒకటి కంటే తక్కువగా కొనసాగుతుంది. అత్యధిక కరోనా కేసులు నమోదు అవుతున్న కేరళ, మహారాష్ట్రలలో కూడా ఈ విలువ ఒకటి కంటే తక్కువగా ఉంది’ అని చెన్నైలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ మేథమెటికల్ సైన్సెస్‌కు (Institute of Mathematical Sciences) చెందిన సితభ్రా సిన్హా (Sitabhra Sinha) చెప్పారు. సిన్హా R-వాల్యూను లెక్కించే పరిశోధకుల బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. వారి డేటా ప్రకారం.. ఆర్ వాల్యూ ముంబై‌లో 1.09, చెన్నైలో 1.11, కోల్‌కతాలో 1.04, బెంగళూరులో 1.06 గా ఉంది.

    Vikarabad: రెండేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. ఇటీవలే పుట్టింటికి వెళ్లింది.. కానీ ఇలా చేస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు..

    కరోనా సెకండ్ వేవ్ సమయంలో..
    ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ( second wave of the COVID-19) విజృంభణ సమయంలో.. భారీగా కేసులు నమోదు అయ్యాయి. అప్పట్లో కరోనా వ్యాప్తి తీరు ఆందోళన కలిగించింది. కరోనా కేసులు అధికంగా వెలుగుచూసిన మార్చి 9 నుంచి ఏప్రిల్ 21 మధ్య కాలంలో దేశంలో ఆర్ వాల్యూ 1.37గా ఉన్నట్టు అంచనా వేయబడింది. ఆర్ వాల్యూ ఒకటి కంటే ఎక్కవగా ఉంటే.. ఆందోళన కలిగించే అంశమని పరిశోధకులు చెబుతున్నారు. ఇక, ఆగస్టులో ఆర్ వాల్యూ మరోసాకి ఒకటి కంటే ఎక్కువగా ఉండటం కాసింత ఆందోళన కలిగించింది. అయితే ప్రస్తుతం ఆ విలువ 0.92కి చేరిందని పరిశోధకులు తెలపడం.. ఊరట కలిగించే విషయం.
    Published by:Sumanth Kanukula
    First published: