Telangana: తెలంగాణలో 1,80,000 కరోనా మరణాలు.. చర్చకు సిద్ధమన్న కాంగ్రెస్

ప్రతీకాత్మక చిత్రం

Telangana: మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, ఛత్తీస్‌గఢ్, కేరళ, ఒరిస్సా, పంజాబ్, జమ్మూకాశ్మిర్, ఢిల్లీ రాష్ట్రాల్లో వేల సంఖ్యలో చనిపోయారని అక్కడి ప్రభుత్వాలు లెక్కలు చూపాయని దాసోజు శ్రవణ్ అన్నారు.

  • Share this:
    తెలంగాణలో కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్‌లలో లక్షా 80 వేల మంది చనిపోయారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం 3710 మంది మాత్రమే చనిపోయారని చెబుతోందని విమర్శించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా మరణాలు ఎక్కువగా వున్నాయని.. కానీ ప్రభుత్వం మాత్రం వాటిని తక్కువ చేసి చూపించిందని అన్నారు. కోవిడ్ మరణాలపై ఆధారాలతో చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన సవాల్ విసిరారు. టీఆర్ఎస్ తరపున ఈ చర్చకు ఎవరు వస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, ఛత్తీస్‌గఢ్, కేరళ, ఒరిస్సా, పంజాబ్, జమ్మూకాశ్మిర్, ఢిల్లీ రాష్ట్రాల్లో వేల సంఖ్యలో చనిపోయారని అక్కడి ప్రభుత్వాలు లెక్కలు చూపాయని దాసోజు శ్రవణ్ అన్నారు.

    కోవిడ్ వల్ల తల్లిదండ్రులు చనిపోయి.. చాలామంది పిల్లలు అనాథలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మరణాలను దాస్తున్నాయని అన్నారు. రాష్ట్ర సర్కార్ ఇచ్చిన దొంగ సంఖ్యను కేంద్రం పార్లమెంట్‌లో తక్కువ చేసి చూపడం దారుణమని విమర్శించారు. .దేశవ్యాప్తంగా కోవిడ్ మరణాలపై అడిట్ జరగాలని డిమాండ్ చేశారు. కోవిడ్ మరణాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాస్తున్నామని అన్నారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీలపై న్యాయపరమైన పోరాటం చేస్తామని దాసోజు శ్రవణ్ అన్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published: