COVID-19 Crisis: నెట్‌వర్క్18 ఉద్యోగుల ఒక రోజు వేతనం ప్రధాని సహాయ నిధికి విరాళం

COVID-19 Crisis | దినసరి కూలీలకు ఆపన్నహస్తం అందించేందుకు నెట్‌వర్క్18 జర్నలిస్టులు, ఉద్యోగులు స్వచ్ఛందంగా తమ ఒక రోజు వేతనాన్ని ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధికి ఇచ్చేందుకు ముందుకు రావడం విశేషం.

news18-telugu
Updated: March 24, 2020, 4:57 PM IST
COVID-19 Crisis: నెట్‌వర్క్18 ఉద్యోగుల ఒక రోజు వేతనం ప్రధాని సహాయ నిధికి విరాళం
COVID-19 Crisis: నెట్‌వర్క్18 ఉద్యోగుల ఒక రోజు వేతనం ప్రధాని సహాయ నిధికి విరాళం
  • Share this:
ప్రస్తుతం దేశం సంక్షోభ కాలాన్ని ఎదుర్కొంటోంది. కరోనా వైరస్ మహమ్మారి కొట్టిన దెబ్బకు దేశమంతా సంక్షోభంలోకి నెట్టివేయబడింది. ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓవైపు కరోనా వైరస్‌పై పోరాడుతున్న ప్రభుత్వం, మరోవైపు ప్రజలను ఆదుకునేందుకు చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం అత్యధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారిలో రోజువారీ కూలీలు ముందువరుసలో ఉన్నారు. కూలీకి వెళ్తే తప్ప పూట గడవని కుటుంబాలు వాళ్లవి. కానీ ప్రస్తుతం కూలీకి వెళ్లడం కాదు కదా, ఇంట్లోంచి బయటకు వెళ్లే పరిస్థితులే లేవు. ఇలాంటి సమయంలో వారిని ఆదుకోవడానికి నెట్‌వర్క్18 గ్రూప్ ముందుకు వచ్చింది. దినసరి కూలీలకు ఆపన్నహస్తం అందించేందుకు నెట్‌వర్క్18 జర్నలిస్టులు, ఉద్యోగులు స్వచ్ఛందంగా తమ ఒక రోజు వేతనాన్ని ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధికి ఇచ్చేందుకు ముందుకు రావడం విశేషం.


ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధికి ఎవరైనా విరాళాలను ఇవ్వొచ్చు. ఇలాంటి అత్యవసర సందర్భాల్లో ఆ నిధుల్ని ఖర్చు చేస్తుంది ప్రభుత్వం. వ్యక్తిగతంగానే కాదు, సంస్థలు, ట్రస్టులు, కంపెనీలు ఇలా ఎవరైనా విరాళాలు ఇవ్వొచ్చు. ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధికి ఇచ్చే విరాళంపై ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 జీ కింద ఈ మినహాయింపు పొందొచ్చు.

ఇవి కూడా చదవండి:

Free Courses: ఇంట్లో ఖాళీగా ఉన్నారా? ఆన్‌లైన్‌లో ఫ్రీగా ఈ కోర్సులు చేయండిGood News: మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీలు లేవు... ఇంకా మరెన్నో శుభవార్తలు

Coronavirus: హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ పాయింట్స్ మర్చిపోవద్దు
Published by: Santhosh Kumar S
First published: March 24, 2020, 4:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading