దేశవ్యాప్తంగా పెరిగిన కరోనా కేసులు.. కానీ ఓ శుభవార్త..

ప్రతీకాత్మక చిత్రం

Corona Cases in India : దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు ఉదయానికి మొత్తం కేసుల సంఖ్య 11,439గా ఉంది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 9756 కాగా, 377 మంది చనిపోయారు.

  • Share this:
    Corona Cases in India : దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు ఉదయానికి మొత్తం కేసుల సంఖ్య 11,439గా ఉంది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 9756 కాగా, 377 మంది చనిపోయారు. ఇక.. 1305 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకోవడం శుభపరిణామం. ఇదిలా ఉండగా, తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 644కు చేరింది. ఈ వైరస్ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 18కి చేరుకోగా... మొత్తం 110 మంది కోవిడ్ 19 నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 516గా ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో యాక్టివ్ కేసుల సంఖ్య 249గా ఉంది. 58 మంది డిశ్చార్జ్ అయ్యారు.

    ఏపీలో ప్రస్తుతం 458 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం కేసులు 483 కేసులు ఉండగా, 16 మంది డిశ్చార్జి అయ్యారు. తొమ్మిది మంది మృతిచెందారు. ఏపీలో నమోదైన కరనా కేసుల్లో అత్యధికం గుంటూరు జిల్లాలోనే ఉన్నాయి. గుంటూరులో 114 మంది కరోనా బాధితులు ఉన్నారు. కర్నూలులో 91 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లా కరోనా ఫ్రీ జిల్లాలుగా కొనసాగుతున్నాయి. ఈ రెండు జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: