Home /News /coronavirus-latest-news /

COVID 19 CALLER TUNE TO STOP PLAYING SOON WHEN YOU MAKE PHONE CALLS PVN

Covid-19 Caller Tune : ఇకపై ఫోన్ చేస్తే కోవిడ్ కాలర్ ట్యూన్ రాదు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Covid-19 Caller Tune : కోవిడ్​ నేపథ్యంలో టెలికాం ఆపరేటర్లు ప్రవేశపెట్టిన కొవిడ్​ కాలర్​ ట్యూన్లు త్వరలో నిలిచిపోనున్నాయి. . కొవిడ్​ నేపథ్యంలో వ్యాక్సినేషన్​, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించే విధంగా కేంద్రం ఈ కాలర్​ ట్యూన్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

ఇంకా చదవండి ...
Covid-19 Caller Tune : కొవిడ్​ నేపథ్యంలో టెలికాం ఆపరేటర్లు ప్రవేశపెట్టిన కొవిడ్​ కాలర్​ ట్యూన్లు త్వరలో నిలిచిపోనున్నాయి. . కొవిడ్​ నేపథ్యంలో వ్యాక్సినేషన్​, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించే విధంగా కేంద్రం ఈ కాలర్​ ట్యూన్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం వల్ల కొవిడ్‌ ప్రీకాల్‌ సందేశాలను నిలిపివేయాలని కేంద్రం భావిస్తోంది.

వీటి వల్ల అత్యవసర సమయాల్లో ఫోన్​కాల్​ మాట్లాడటం ఆలస్యమవుతోందని విజ్ఞప్తులు వస్తున్న నేపథ్యంలో ఈ కాలర్​ ట్యూన్లను నిలిపివేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖకు టెలీకమ్యూనికేషన్ల విభాగం లేఖ రాసింది. భారత సెల్యులర్‌ ఆపరేటర్ల సంఘం, మొబైల్‌ వినియోగదారుల నుంచి ఈ మేరకు విజ్ఞప్తులు వచ్చినట్లు తెలిపింది. ఈ కొవిడ్‌ కాలర్‌ట్యూన్లను నిలిపివేసే అంశాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ పరిశీలిస్తోంది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Corona alert, Covid -19 pandemic, Covid vaccine

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు