news18-telugu
Updated: July 16, 2020, 7:59 PM IST
ప్రతీకాత్మక చిత్రం
కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ విలవిలలాడుతోంది. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన లేటెస్ట్ బులెటిన్ మేరకు గత 24 గంటల్లో ఏపీలో కొత్తగా 2,593 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావడంతో...మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 38,044కి చేరింది. కాగా కరోనా కాటుకు గత 24 గం.ల్లో 40 మంది మృతి చెందగా...మొత్తం కరోనా మరణాల సంఖ్య 493కి చేరింది. గత 24 గం.ల్లో ఈ జిల్లాల్లో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ జిల్లాల్లో కరోనా కట్టడికి అధికార యంత్రాంగం మరిన్ని చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమవుతోంది. అటు ప్రజలు కూడా కరోనా కేసులు తమ జిల్లాల్లో పెరుగుతున్న దృష్ట్యా మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏపీలో ఏయే జిల్లాల్లో కొత్తగా అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయో ఇక్కడ చూద్దాం...
1.కర్నూలు జిల్లా (590 కేసులు)రాష్ట్రంలోనే కర్నూలు జిల్లాలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గం.ల్లో ఆ జిల్లాల్లో 590 పాజిటివ్ కేసులు నమోదుకాగా...ఒకరు మృతి చెందారు. ఇప్పటి వరకు ఆ జిల్లాలో మొత్తం 4816 పాజిటివ్ కేసులు(రాష్ట్రంలోనే అత్యధికం) నమోదుకాగా...వీరిలో 2285 మంది చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. 2417 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా మొత్తం కరోనా మరణాలు 114 ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.
2.తూర్పు గోదావరి జిల్లా(500 కేసులు)
తూర్పు గోదావరి జిల్లాలో రెండో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గం.ల్లో ఆ జిల్లాల్లో 500 పాజిటివ్ కేసులు నమోదుకాగా...8 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు ఆ జిల్లాలో మొత్తం 3862 పాజిటివ్ కేసులు నమోదుకాగా...వీరిలో 1082 మంది చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. 2751 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కరోనా మరణాలు 29గా ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.
3.చిత్తూరు జిల్లా(205)
గత 24 గం.ల్లో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల జాబితాలో చిత్తూరు మూడో స్థానంలో ఉంది. గడిచిన 24 గం.ల్లో ఆ జిల్లాల్లో 205 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా...ఐదుగురు మృతి చెందారు. ఇప్పటి వరకు ఆ జిల్లాలో మొత్తం 3536 పాజిటివ్ కేసులు నమోదుకాగా...వీరిలో 1303 మంది చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. 2195 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం 38 కరోనా మరణాలు నమోదైనట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.

ప్రతీకాత్మక చిత్రం
4.పశ్చిమ గోదావరి జిల్లా (195)
గత 24 గం.ల్లో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల జాబితాలో పశ్చిమ గోదావరి నాలుగో స్థానంలో నిలుస్తోంది. గడిచిన 24 గం.ల్లో ఆ జిల్లాల్లో 195 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఆ జిల్లాలో మొత్తం 2,428 పాజిటివ్ కేసులు నమోదుకాగా...వీరిలో 1084 మంది చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. 1312 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం 32 కరోనా మరణాలు నమోదైనట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.
5.అనంతపురం జిల్లా (174)
గత 24 గం.ల్లో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల జాబితాలో అనంతపురం జిల్లా నాలుగో స్థానంలో నిలుస్తోంది. గడిచిన 24 గం.ల్లో ఆ జిల్లాల్లో 174 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా...ముగ్గురు మృతి చెందారు. ఇప్పటి వరకు ఆ జిల్లాలో మొత్తం 3987 పాజిటివ్ కేసులు నమోదుకాగా...వీరిలో 2404 మంది చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. 1531 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం 52 కరోనా మరణాలు నమోదైనట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.
గుంటూరు జిల్లా (139), కృష్ణా జిల్లా(132), కడప జిల్లా (126), నెల్లూరు జిల్లా (126), శ్రీకాకుళం జిల్లా (111), విజయనగరం జిల్లా (101) తదుపరి స్థానాల్లో ఉన్నాయి.
గడిచిన 24 గం.ల్లో ఆ జిల్లాల్లో అత్యధిక మరణాలు
గడిచిన 24 గం.ల్లో ఏపీలో మొత్తం 40 మంది కరోనా కాటుకు బలయ్యారు. రాష్ట్రంలో అత్యధిక మరణాలు తూర్పుగోదావరి జిల్లా(8), ప్రకాశం(8), చిత్తూరు(5) జిల్లాల్లో నమోదయ్యాయి. కడప జిల్లా (4), అనంతపురం(3), గుంటూరు(3), నెల్లూరు(3), విశాఖపట్నం(3) జిల్లాల్లో మరణాలు నమోదయ్యాయి.
Published by:
Janardhan V
First published:
July 16, 2020, 7:30 PM IST