ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ వైరస్ ఇండియాలోకి ప్రవేశించింది. ఇండియాలో రెండు ఒమైక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని కేంద్రం వైద్య,ఆరోగ్యశాఖ ధృవీకరించింది. కర్ణాటకలో రెండు ఒమైక్రాన్ కేసులు నమోదైనట్టు వెల్లడించింది. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో ఈ వైరస్‌ను గుర్తించారు. అందులో ఒకరి వయసు 66 కాగా, మరొకరి వయసు 46 సంవత్సరాలు. వీరి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌ను ట్రేస్ చేసి టెస్ట్ చేస్తున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. ఇప్పటివరకు వారిలో ఎలాంటి తీవ్ర లక్షణాలు లేవని వెల్లడించారు. వారిలో కేవలం స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. వారితో కాంటాక్ట్‌లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితిని కూడా పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.
ఒమైక్రాన్ కేసులు వెలుగు చూసిన దేశాల నుంచి ప్రయాణికులు కచ్చితంగా ఎయిర్‌పోర్టులోనే ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వాళ్లంతా కచ్చితంగా కరోనా ప్రోటోకాల్ పాటించాలని చెప్పారు. వారికి కరోనా నెగిటివ్ వచ్చినప్పటికీ.. 7 రోజులు హోమ్ క్వారంటైన్లో ఉండాలని స్పష్టం చేశారు. కరోనా కొత్త వేరియంట్‌ను గుర్తించేందుకు కొత్తగా 37 ల్యాబ్‌లను ఏర్పాటు చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. కానీ అంతా అప్రమత్తంగా ఉండాలని ఐసీఎంఆర్ డీజీ బలరాం భార్గవ్ సూచించారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 29 దేశాల్లో 373 ఒమైక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయని కేంద్రం తెలిపింది.
తెలంగాణలో ఒక కరోనా కేసు.. అప్రమత్తమైన అధికారులు
ఇదిలా ఉంటే నిన్న బ్రిటన్, సింగపూర్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు 325 మంది ప్రయాణికులు వచ్చారు. వారిలో రాష్ట్రానికి చెందిన వారు 239 మంది ఉన్నారు. వీరందరికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో యూకే నుంచి ఓ మహిళా ప్రయాణికురాలికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆమెను తక్షణమే గచ్చిబౌలి టిమ్స్‌కు తరలించి ఐసోలేషన్‌లో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. ఆమె నుంచి శాంపిళ్లను సేకరించి ఫుల్ జీనోమ్ సీక్వెన్స్‌కు పంపించారు.మూడు, నాలుగు రోజుల్లో ఆ రిపోర్టు వస్తేనే ఆ వైరస్ ఒమిక్రాన్ వేరియంటా? లేక డెల్టా వేరియంటా? అనే విషయం తేలుతుందని తెలిపారు.
KCR నయా వ్యూహం.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొడుతున్నారా ? అటు BJP.. మరోవైపు..
ఆ హోదాపై టీఆర్ఎస్ నేతల ఆశలు.. కేసీఆర్ ఆలోచన ఏంటి ?
Weight Loss: బరువు తగ్గాలని ట్రై చేస్తున్నారా.. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా చేయండి
మీరు నాన్ వెజ్ తినరా ?.. అయితే ప్రొటీన్లు పుష్కలంగా లభించే ఈ ఆహారాలను తీసుకోండి..
ఒమిక్రాన్ వైరస్ వేగంగా విస్తరిస్తోందని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. 3 రోజుల్లోనే మూడు దేశాల నుంచి 24 దేశాలకు విస్తరించిందని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డిసెంబర్ 31వ తేదీలోపు వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకంటున్నామని తెలిపారు. మాస్కు ధరించడం, వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి చేసుకోవాలి. జాగ్రత్తలు పాటించకపోతే ఇప్పుడు జరుగుతున్న అసత్య ప్రచారాలే వాస్తవాలవుతాయని అన్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Omicron corona variant