HOME »NEWS »Corona vilayatandavam »covaxin can deal with new coronavirus strains too says bharat biotech sk gh

Covaxin: గుడ్ న్యూస్ చెప్పిన భారత్ బయోటెక్.. కొత్త స్ట్రెయిన్‌కు కూడా చెక్

Covaxin: గుడ్ న్యూస్ చెప్పిన భారత్ బయోటెక్.. కొత్త స్ట్రెయిన్‌కు కూడా చెక్
ప్రతీకాత్మక చిత్రం

Corona vaccine: కొత్త రకం కరోనా వైరస్ పై కూడా కోవాగ్జిన్ (Covaxin) సమర్థవంతంగా పనిచేస్తుంది, ముక్కు ద్వారా టీకా ఇస్తే మరింత చక్కగా ఈ టీకా పనిచేస్తుందంటూ భారత్ బయోటెక్ (Bharat Biotech) స్పష్టంచేసింది.

  • Share this:
కరోనా వైరస్ సోకకుండా ఉండేలా కొత్తరకం కరోనా వైరస్‌పై కూడా తాము అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకా పనిచేస్తుందని భారత్ బయోటెక్ చేసిన ప్రకటన మరింత ఊరిస్తోంది. కోవాగ్జిన్ లోని ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్ లోని 2 విభాగాలు ఈ కొత్తరకం వైరస్ రకాన్ని సమర్థంగా అడ్డుకుంటాయని సంస్థ వివరించింది. ఈ మేరకు భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల కీలక ప్రకటన చేశారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) -భారత్ బయోటెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ కోవాగ్జిన్ టీకా తాజాగా 3వ దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నట్టు కృష్ణ ఎల్ల వివరించారు.

మరో 2 నెలల్లో క్లినికల్ ట్రయల్స్ తుది దశకు చేరుకుంటాయని, దీన్ని అత్యవసరంగా ఉపయోగించేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు అప్లై చేసుకున్నట్టు ఆయన తెలిపారు. అంతేకాదు ముక్కు ద్వారా కోవాగ్జిన్ టీకా ఇస్తే మరింత సమర్థవంతంగా పనిచేస్తోందని సంస్థ ప్రకటించటం సామాన్యులకు కాస్త ఊరటనిచ్చే వార్త. ప్రస్తుతం 20,000 మంది వాలంటీర్లపై కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ సాగుతుండగా అతి త్వరలో వీటి ఫలితాలు రానున్నాయి. వ్యాక్సిన్ల ఉత్పత్తిలో భారత్ బయోటెక్ ముందుండగా సింగిల్ డోస్ నాజల్ వ్యాక్సిన్ గా కోవాగ్జిన్ ఇచ్చేందుకు కృషి చేస్తోంది.



అనుమానాలెన్నో
బ్రిటన్ నుంచి ప్రపంచ దేశాలకు సోకుతున్న ఈ సరికొత్త స్ట్రెయిన్ అత్యంత స్ట్రాంగ్ వైరస్ గా భావిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల పాలిట ఇది మరింత భయంకరంగా ఉంటుందని వైద్యులు అంచనా వేస్తున్నారు. ఇక ఆల్రెడీ పలు దేశాల్లోని మార్కెట్లలోకి వచ్చిన కరోనా టీకాలు సమర్థవంతంగా పనిచేస్తాయా లేదా, సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొనగా ఈ కొత్తరకం వైరస్ పై టీకాలు ఎలా పనిచేస్తాయన్న అనుమానాలు మరింత ఎక్కువగా ఉన్నాయి.

భవిష్యత్తులో మహమ్మారుల గండం
మరోవైపు మనం గుర్తించని బోలెడు వైరస్ లతో భవిష్యత్తులో చాలా ముప్పు ఉంటుందని హెచ్చరిస్తున్న కృష్ణ ఎల్లా.. వైరస్ లను ఇలా నిర్లక్ష్యం చేస్తే మాత్రం మళ్లీ మహమ్మారులుగా అవి ప్రబలుతాయన్నారు. “ఇన్నోవేషన్ ఇన్ పబ్లిక్ హెల్త్-అవర్ జర్నీ" అన్న అంశంపై ప్రసంగించిన ఆయన మనం గుర్తించని, నిర్లక్ష్యం చూపుతున్న 40,000కు పైగా వైరస్ లు, 10,000కు పైగా జూనోటిక్ వైరస్ ల వల్ల భవిష్యత్తులో మహమ్మారుల (pandemics) బెడద దాపురించే ఉంటుందని కృష్ణ హెచ్చరించారు. సాధారణంగా ఇలాంటి వ్యాధులన్నీ అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ప్రబలుతాయని, అందుకే అమెరికా, యూరోపియన్ దేశాలు మనమంటే భయపడతారని ఆయన వివరించారు.
Published by:Shiva Kumar Addula
First published:December 30, 2020, 08:58 IST

टॉप स्टोरीज