Home /News /coronavirus-latest-news /

COVAXIN BE GIVEN TO OTHER COMPANIES FOR MANUFACTURING CENTRE AGREES FOR PROPOSAL AK

Covaxin: కోవాగ్జిన్ ఉత్పత్తి పెంపుపై కేంద్రం కీలక నిర్ణయం.. సీఎం జగన్ ప్రతిపాదనకు ఓకే..

కొవాగ్జిన్ టీకా (ఫ్రతీకాత్మక చిత్రం)

కొవాగ్జిన్ టీకా (ఫ్రతీకాత్మక చిత్రం)

Covaxin: కొందరు కోవాగ్జిన్ ఉత్పత్తి పెంపు కోసం ఈ ఫార్ములాను ఇతర కంపెనీలకు కూడా ఇవ్వాలని కోరారని.. ఇందుకు భారత్ బయోటెక్ కూడా ఒప్పుకుందని వెల్లడించారు.

    కరోనా టీకాల్లో ఒకటైన కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ ఉత్పత్తి పెంపు కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకునేందుకు రెడీ అయ్యింది. కోవాగ్జిన్ ఉత్పత్తి పెంచేందుకు వీలుగా.. ఈ ఫార్ములాను ఇతర ఫార్మా కంపెనీలకు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఇందుకు కోవాగ్జిన్ తయారీ కంపెనీ అయిన భారత్ బయోటెక్ కూడా అంగీకరించిందని నీతి అయోగ్ వైద్య విభాగం సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. కొందరు కోవాగ్జిన్ ఉత్పత్తి పెంపు కోసం ఈ ఫార్ములాను ఇతర కంపెనీలకు కూడా ఇవ్వాలని కోరారని.. ఇందుకు భారత్ బయోటెక్ కూడా ఒప్పుకుందని వెల్లడించారు.

    ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేందుకు ఆసక్తి చూపే కంపెనీలకు ఆహ్వానం పలుకుతున్నామని అన్నారు. వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచేందుకు ఆ కంపెనీలన్నీ కలిసి పని చేయాల్సి ఉంటుందని.. ఇందుకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని డాక్టర్ వీకే పాల్ వెల్లడించారు.



    ఇదే అంశానికి సంబంధించి ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి రెండు రోజుల క్రితం లేఖ రాశారు. కోవాగ్జిన్ తయారీ దేశీయ అవసరాలను పూర్తిగా తీర్చలేకపోతుందని లేఖలో పేర్కొన్న సీఎం జగన్, ఈ వ్యాక్సిన్‌ను భారీగా ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. కోవాగ్జిన్ తయారీకి భారత్ బయోటెక్, ఐసీఎంఆర్, యన్.ఐ.వి లు కలిసి కృషి చేశాయని అన్నారు. తయారీదారులు ముందుకు వస్తే కోవాగ్జిన్ ఉత్పత్తి చేసేందుకు.. వారికి టెక్నాలజీ బదిలీ చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరారు. వీలైనంత త్వరగా వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచి అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఎవరైనా వ్యాక్సిన్ ఉత్పత్తికి ముందుకు వస్తే, ప్రజల ఆరోగ్యం కోసం వారిని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. ఈ విషయంలో తక్షణం ప్రధాని జోక్యం చేసుకుని, ఈ సలహాలను అమల్లోకి తీసుకురావాలని కోరారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Coronavirus, Covaxin, COVID-19 vaccine

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు