news18-telugu
Updated: November 13, 2020, 6:32 AM IST
ఫ్రతీకాత్మక చిత్రం
కరోనా భయం ప్రజలను వెంటాడుతూనే ఉంది. ముందుతో పోలిస్తే కరోనా రికవరీ రేటు బాగా పెరిగినప్పటికీ.. ఆ పేరు వింటనే కొందరు వణికిపోతున్నారు. కొందరైతే కరోనా ఆందోళనతో ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. తాజాగా ఇలాంటి సంఘనే జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. కరోనా భయంతో దంపతులు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. వివరాలు.. గంజి రాంబాబు(45), లావణ్య(40) దంపతులు జగిత్యాల జిల్లా కేంద్రంలోని శివవీధిలో నివాసం ఉంటున్నారు. అయితే రాంబాబుకు మూడు రోజుల క్రితం కరోనా పాకిటివ్గా నిర్దారణ అయింది. ఈ క్రమంలోనే పరీక్షలు చేయించుకున్న లావణ్యకు గురువారం ఉదయం కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో లావణ్య ఈ విషయాన్ని చొప్పదండి మండలం అర్నకొండలోని ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. తమకు కరోనా పాజిటివ్‌గా తేలిందని.. కరీంనగర్‌లోని ఆస్పత్రికి వస్తున్నట్టు తెలిపింది.
దీంతో లావణ్య బంధువులు సాయంత్రం వరకు ఆమె చెప్పిన ఆస్పత్రి వద్దకు వచ్చారు. అయితే లావణ్య, రాంబాబు మాత్రం ఆస్పత్రి వద్దకు రాలేదు. దీంతో వారు లావణ్యను ఫోన్లో కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో వారు జగిత్యాలలోని లావణ్య ఇంటికి బయలుదేరారు. వారు ఇంటికి వచ్చి చూసేసరికి రాంబాబు, లావణ్య ఇద్దరు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఈ ఘటనపై బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు కరోనా నిబంధనల ప్రకారం రాత్రి 11 గంటల ప్రాంతంలో మృతదేహాలను జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.
కాగా, కరోనా సోకిందనే భయం, సంతానం లేకపోవడంతో మనస్తాపం చెంది రాంబాబు, లావణ్య దంపతులు బలవన్మరణం చేసుకున్నట్టుగా బంధువులు భావిస్తున్నారు. ఇక, రాంబాబు గత పదేళ్లుగా మహారాష్ట్రలో ఉంటున్నాడు. అయితే 10 నెలల క్రితం అతడి తండ్రి మృతిచెందడంతో రాంబాబు జగిత్యాలకు వచ్చాడు. ఆ తర్వాత కరోనా నేపథ్యంలో ఇక్కడే ఉండిపోయాడు.
Published by:
Sumanth Kanukula
First published:
November 13, 2020, 6:32 AM IST