హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

రాజమండ్రిలో విషాదం.. కరోనా అనుమానంతో దంపతుల ఆత్మహత్య..?

రాజమండ్రిలో విషాదం.. కరోనా అనుమానంతో దంపతుల ఆత్మహత్య..?

ఈ విషయంలో ఆందోళన వద్దని తాము చెప్పినా.. లక్ష్మణ్ వినలేదని కుటుంబసభ్యులు చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు.

ఈ విషయంలో ఆందోళన వద్దని తాము చెప్పినా.. లక్ష్మణ్ వినలేదని కుటుంబసభ్యులు చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు.

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణ విషాదం చోటుచేసుకుంది. రాజమండ్రిలోని ప్రకాష్ నగర్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో దంపతులు అనుమానాస్పదంగా మృతి చెందారు.

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణ విషాదం చోటుచేసుకుంది. రాజమండ్రిలోని ప్రకాష్ నగర్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో దంపతులు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఇంటికి సమీపంలోని తుప్పల్లో కాలిపోయి భార్యభర్తల మృత దేహాలు ఉండటం కలకలం రేగింది. సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు వారి వివరాలు సేకరిస్తున్నారు. వీరు స్థానికులా? లేక ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఆత్మహత్యకు పాల్పడ్డారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. కరోనా వచ్చిందన్న అనుమానంతోనే తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నామని సూసైడ్ నోట్‌లో రాసి ఉండటాన్ని బట్టి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

వీరిని చంపేసి, కిరోసిన్ పోసి కాల్చేసి.. సూసైడ్ నోట్ రాసిపెట్టారా? లేక వాళ్లే ఆత్మహత్యకు పాల్పడ్డారా? అన్న కోణాల్లో విచారణ చేపట్టారు. కరోనా వచ్చినందుకే ఆత్మహత్య చేసుకుంటారా? అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

First published:

Tags: AP News, Corona, Coronavirus, Crime, Crime news, Rajahmundry S01p08

ఉత్తమ కథలు