Coronil | కరోనా మందంటూ తప్పుడు ప్రచారం.. రాందేవ్ బాబాపై కేసు నమోదు..

కరోనిల్ మందును లాంచ్ చేసిన పతంజలి

Patanjali Corona Medicine | కరోనా వైరస్‌ను తగ్గించే మందు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ యోగా గురు రాందేవ్ బాబాతో పాటు మొత్తం ఐదుగురిపై కేసు నమోదైంది.

  • Share this:
    Case Against Ramdev Baba | కరోనా వైరస్‌ను తగ్గించే మందు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ యోగా గురు రాందేవ్ బాబాతో పాటు మొత్తం ఐదుగురిపై కేసు నమోదైంది. రాందేవ్ బాబా, పతంజలి ఆయుర్వేదిక్ సంస్థ సీఈఓ ఆచార్య బాలకృష్ణ, సైంటిస్ట్ అనురాగ్ వర్షణే, నిమ్స్ చైర్మన్ డాక్టర్ బల్బీర్ సింగ్ తోమర్, డైరెక్టర్ డాక్టర్ అనురాగ్ తోమర్‌ల మీద కూడా జైపూర్‌లో కేసు నమోదు చేశారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌‌కు మందు కనిపెట్టేందుకు ప్రఖ్యాత కంపెనీలు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి పరిశోధనలు చేస్తున్నాయి. ఇంకా వాటికి అనుమతులు రాలేదు. ఇలాంటి సమయంలో కరోనాకు పతంజలి మందు తెచ్చిందంటూ రాందేవ్ బాబా సంచలనం సృష్టించారు. కరోనిల్ పేరుతో ఉన్న ఈ మందు వాడితే 14 రోజుల్లో వైరస్ నయం అయిపోతుందంటూ ప్రకటించారు. ఈనెల 23వ తేదీన పతంజలి సంస్థ దీన్ని రిలీజ్ చేసింది. అనంతరం దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ కూడా ఈ మందు తయారు చేయడానికి అనుసరించిన విధానం, ట్రయల్స్, ఇతరత్రా వివరాలు పంపాలని కోరింది. అలాగే, కోవిడ్ 19కు మందు అంటూ చేస్తున్న ప్రచారాన్ని కూడా ఆపేయాలని స్పష్టం చేసింది.
    First published: