హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

మరో వివాదంలో రోజా.. ప్రజలతో పూల స్వాగతం.. లాక్‌డౌన్ పట్టదా..?

మరో వివాదంలో రోజా.. ప్రజలతో పూల స్వాగతం.. లాక్‌డౌన్ పట్టదా..?

ఈ తెలుగుదేశం వాళ్లు ఎన్ని ట్రోల్స్ చేసినా తాను పట్టించుకోనని చెప్పింది. ఎందుకంటే వీళ్లున్నది 10 శాతం అయితే.. ఎంకరేజ్ చేసే వాళ్లు 90 శాతం మంది అంటుంది రోజా. అయినా తాను రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత డాన్సులు చేయడం లేదని.. కుర్చీలోనే ఉండి అలా చేస్తున్నట్లు చెప్పింది. తన లిమిట్స్ తనకు తెలుసు అంటుంది రోజా.

ఈ తెలుగుదేశం వాళ్లు ఎన్ని ట్రోల్స్ చేసినా తాను పట్టించుకోనని చెప్పింది. ఎందుకంటే వీళ్లున్నది 10 శాతం అయితే.. ఎంకరేజ్ చేసే వాళ్లు 90 శాతం మంది అంటుంది రోజా. అయినా తాను రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత డాన్సులు చేయడం లేదని.. కుర్చీలోనే ఉండి అలా చేస్తున్నట్లు చెప్పింది. తన లిమిట్స్ తనకు తెలుసు అంటుంది రోజా.

లాక్‌డౌన్ అమల్లో ఉన్న ఈ సమయంలో.. ఇంత చిన్న కార్యక్రమానికి అంత హడావిడి, హంగు ఆర్భాటాలు చేయలా..? అని విమర్శలు వెల్లువెత్తున్నాయి. రోజా తీరుపై జనసేన, టీడీపీ నేతలు తీవ్ర స్ధాయిలో మండిపడుతున్నారు

ప్రస్తుతం యావత్ ప్రపంచం కరోనా కష్టాల్లో ఉంది. వైరస్ నుంచి కాపాడుకునేందుకు అన్ని ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. ప్రజలంతా ఇళ్లలోనే ఉండి సామాజిక దూరం పాటిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, రాజకీయ నేతలు కూడా ప్రజల్లో ఉంటూ.. వారి కష్టాలను తెలుసుకుంటున్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్నారు. కానీ వైసీపీ ఎమ్మెల్యే రోజా మాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించారు. మొన్నటి వరకు సేవా కార్యక్రమాలతో మంచి పేరు తెచ్చుకున్న ఆమె.. ఇప్పుడు లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి విమర్శల పాలవుతున్నారు. ఓ కార్యక్రమంలో ఆమె దేవతలా పూజలందుకున్నారు. ప్రజలు పూలు జల్లుతుంటే.. పూబాటలో అందరికీ అభివాదం చేస్తూ ముందుకెళ్లారు ఎమ్మెల్యే రోజా. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఎమ్మెల్యే రోజా ఇటీవల చిత్తూరు జిల్లా పుత్తూరు సుందరయ్య నగర్‌లో ఓ బోరు బావి ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. కరోనా లాక్‌డౌన్ వేళ రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సింది పోయి..ఏకంగా హంగు హార్భాటాలతో నిర్వహించారు. రోజా నడుస్తుంటే.. రోడ్డుకు ఇరువైపులా జనాలు పూల జల్లుతూ స్వాగతం తెలిపారు. సినిమాల్లో మహారాజులకు ప్రజలు స్వాగతం చెబుతున్నట్లుగా ఆ సీన్ కనిపించింది. చిన్న పిల్లలు కూడా పూలు చల్లుతూ కనిపించారు. అలా జనం పూల వర్షం కురిపిస్తుంటే ఆ బాటలో నడుచుకుంటూ ముందుకెళ్లారు రోజా. అనంతరం గ్రామస్తులు భారీ పూల దండను ఎమ్మెల్యే మెడలో వేసి సత్కరించారు. ఆ తర్వాత స్విచాన్ చేసి.. బిందెలో నీళ్లు పట్టి బోరుబావిని ప్రారంభించారు ఎమ్మెల్యే రోజా. ఆమె ప్రారంభించిన మరుక్షణమే జనాలంతా ఎగబడి బిందెల్లో నీళ్లు పట్టుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోజా చేతి గ్లౌజులు, ముఖానికి మాస్క్ ధరించి కనిపించారు. గ్రామ ప్రజలు కూడా కొంత సామాజిక దూరం పాటిస్తూ.. మాస్క్‌లు ధరించారు. ఐతే లాక్‌డౌన్ అమల్లో ఉన్న ఈ సమయంలో.. ఇంత చిన్న కార్యక్రమానికి అంత హడావిడి, హంగు ఆర్భాటాలు చేయలా..? అని విమర్శలు వెల్లువెత్తున్నాయి. రోజా తీరుపై జనసేన, టీడీపీ నేతలు తీవ్ర స్ధాయిలో మండిపడుతున్నారు. ఏపీలో కరోనా విజృంభిస్తోందని.. ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా, ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని చెప్పాల్సింది పోయి, ఇలా చేస్తారా..? అంటూ విరుచుకుపడుతున్నారు. వైసీపీ నేతల చీప్ పబ్లిసిటీతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన ఆమెపై రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ హైకమాండ్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఐతే వైసీపీ వర్గాలు మాత్రం ఆమెను వెనకేసుకొస్తున్నాయి. సామాజిక దూరం పాటిస్తూనే... ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని ఎదురుదాడికి దిగుతున్నారు.

First published:

Tags: Coronavirus, Covid-19, MLA Roja, Roja Selvamani, Ysrcp

ఉత్తమ కథలు