వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

ప్రతీకాత్మక చిత్రం

కరోనా దెబ్బకు చాలా సాఫ్ట్‌వేర్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించాయి. ఇంటి నుంచే పని చేయాలని కోరాయి. ల్యాప్‌టాప్ చేతిలో పెట్టి వర్క్ చేయాలని స్పష్టం చేశాయి.

 • Share this:
  కరోనా దెబ్బకు చాలా సాఫ్ట్‌వేర్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించాయి. ఇంటి నుంచే పని చేయాలని కోరాయి. ల్యాప్‌టాప్ చేతిలో పెట్టి వర్క్ చేయాలని స్పష్టం చేశాయి. అయితే, ముందుగా.. వర్క్ చేసేందుకు అనువైన స్థలాన్ని ఎంచుకోవాలి. తర్వాత ఏ విధంగా కూర్చొని వర్క్ చేస్తున్నారనేది కూడా ముఖ్యమే. అదే సమయంలో ఇంట్లోని వైఫై సిగ్నల్ సరిగ్గా ఉందా? ఇంటర్నెట్ వస్తుందా? అన్నది చూసుకోవాలి. పని చేయాలంటే ఇంటర్నెట్ ఉండటం తప్పనిసరి. ఇంటర్నెట్ స్లోగా ఉన్నా, పనిచేయకపోయినా పని చేయడం కుదరదు. దాని వల్ల ప్రొడక్టివిటీ తగ్గడమే కాకుండా, మనకూ విసుగు పుడుతుంది. ఈ నేపథ్యంలో ముందే జాగ్రత్తలు తీసుకొని సరైన ఇంటర్నెట్ కనెక్షన్ ఉండేలా చూసుకోవడం ఉత్తమం.

  పైఅధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లోకి రావాలన్నా, ఫైల్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలన్నా, అప్‌లోడ్ చేయాలన్నా.. ఇంటర్నెట్ స్పీడుగా ఉండాల్సిందే. కనీసంలో కనీసం 300 ఎంబీపీఎస్ స్పీడుతో నెట్ ఉంటేనే వర్క్ చేయడానికి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇంటర్నెట్‌పై దృష్టి సారించాల్సిందే. వైఫై సిగ్నల్ ద్వారా ఇంటర్నెట్ వాడితే.. రౌటర్‌లోని సెట్టింగ్స్‌ను ముందే సెట్ చేసుకోవాలి. లేకపోతే సమస్య తప్పదు. ఇలా.. కొన్ని చిన్న జాగ్రత్తలు పాటించి వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు.
  Published by:Shravan Kumar Bommakanti
  First published:

  అగ్ర కథనాలు