'2021 వరకు కరోనాతో కలిసి జీవించాల్సిందే'.. అదొక్కటే మార్గం

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన చర్చలో హార్వర్డ్ ప్రొఫెసరన్ ఆశీష్ ఝా, యూరోపియన్ సీడీసీలో మాజీ శాస్త్రవేత్త ప్రొఫెసర్ జోహన్ గీసెకా పాల్గొని.. తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

news18-telugu
Updated: May 27, 2020, 2:24 PM IST
'2021 వరకు కరోనాతో కలిసి జీవించాల్సిందే'.. అదొక్కటే మార్గం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. భారత్‌లోనూ పెద్ద మొత్తంలో కేసులు నమోదవుతున్నాయి. ఐతే ఈ వైరస్ ఇప్పట్లో మనల్ని వదిలేలా లేదని వైద్యఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2021 వరకు కరోనాతో కలిసి జీవించాల్సిందేనని.. విస్తృతంగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం ఒక్కటే మనముందున్న మార్గమని చెప్పారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన చర్చలో హార్వర్డ్ ప్రొఫెసరన్ ఆశీష్ ఝా, యూరోపియన్ సీడీసీలో మాజీ శాస్త్రవేత్త ప్రొఫెసర్ జోహన్ గీసెకా పాల్గొని.. తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కరోనాకు ఇప్పట్లో వాక్సిన్ వచ్చే అవకాశం లేదని.. మరో ఏడాది కాలం పట్టవచ్చని ఆశీష్ ఝా అన్నారు.

కరోనా సమస్య 12-18 నెలల పాటు ఉండే అవకాశముంది. 2012 వరకు కరోనా మనతోనే ఉంటుంది. భారతీయులు వాడే బీసీజీ వాక్సిన్ కేవలం మీడియేటర్‌గానే పనిచేస్తుంది. అది కరోనాను కట్టడి చేయలగదనడానికి ఆధారాలు లేవు. లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే క్రమంలో ప్రజల్లో విశ్వాసాన్ని నింపాల్సిన అవసరం ఉంది. ప్రజల విశ్వాసమే ఆర్థిక వ్యవస్థకు పునాది.
ఆశీష్ ఝా


మరోవైపు భారత్‌లో సులభతర లాక్‌డౌన్‌ మాత్రమే కొనసాగించాలి. లాక్‌డౌన్ కఠినంగా అమలు చేస్తే మరింత గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే ప్రమాదముంది. లాక్‌డౌన్‌ను ఎత్తివేసి కరోనా రిస్క్ ఎక్కువగా ఉన్న వారిపట్ల జాగ్రత్తగా వ్యహరించాలి. ప్రభుత్వ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి.
జోహాన్

ఈ చర్చలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. కరోనా వైరస్ యావత్ ప్రపంచ గతినే మార్చివేసిందని అన్నారు. కరోనా కారణంగా సరికొత్త ప్రపంచం ఆవిష్కృతం కాబోతందని చెప్పారు. ప్రపంచ చరిత్రలో 9/11 దాడులు ఓ అధ్యాయంలా నిలిచిందని.. ఇప్పుడు కొవిడ్-19న విపత్తు కొత్త పుస్తకంలా భావించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు రాహుల్.
First published: May 27, 2020, 2:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading