గుడ్‌న్యూస్.. కరోనా వాక్సిన్ వచ్చేస్తోంది.. ఆ రోజు నుంచే టీకాలు..

కరోనా వాక్సిన్ వచ్చేస్తోందని.. టీకాల పంపిణీకి సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలకు లేఖ రాసింది. నవంబరు 1 నాటికి టీకాలు ఇచ్చేందుకు అంతా సన్నద్ధంగా ఉండాలని పేర్కొంది.

news18-telugu
Updated: September 3, 2020, 1:02 PM IST
గుడ్‌న్యూస్.. కరోనా వాక్సిన్ వచ్చేస్తోంది.. ఆ రోజు నుంచే టీకాలు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వాక్సిన్‌ కోసం యావత్ ప్రపంచం ఎదుచూస్తోంది. మహమ్మారిని తరిమికొట్టే టీకాలు త్వరగా ప్రజలకు అందుబాటులోకి రావాలని అందరూ కోరుతున్నారు. 'స్పుత్నిక్ వీ' వాక్సిన్‌ను రష్యా విడుదల చేసినప్పటికీ.. దానిపై అనుమానాలు వ్యక్తం కావడంతో దానిపై ఎవరూ పెద్దగా ఆశలుపెట్టుకోలేదు. మరి ఏ వ్యాక్సిన్ ముందుగా వస్తుందని అంతా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అమెరికా ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. కరోనా వాక్సిన్ వచ్చేస్తోందని.. టీకాల పంపిణీకి సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలకు లేఖ రాసింది. నవంబరు 1 నాటికి టీకాలు ఇచ్చేందుకు అంతా సన్నద్ధంగా ఉండాలని పేర్కొంది.

యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (అమెరికా వ్యాధి నియంత్రణ మరియు నివారణ కేంద్రం) డైరెక్టర్ రాబర్ట్ రెడ్‌ఫీల్డ్ ఆగస్టు 27న అమెరికాలోని అన్ని రాష్ట్రాల గవ్నర్లకు లేఖ రాశారు. రాష్ట్రాలు, స్థానిక ఆరోగ్యశాఖలు, ఆస్పత్రులకు టీకా పంపిణీ కోసం త్వరలోనే మెక్‌కెసన్ కార్ప్ (టీకాల పంపిణీ చేసే సంస్థ) నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. కరోనా టీకాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు మీ సాయం కావాలని లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నవంబరు నెలా ప్రారంభం నుంచే టీకాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చే అవకాశాలున్నాయి. మొదట డాక్టర్లు, హెల్త్ వర్కర్లకు వాక్సిన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత టీకా ఉత్పత్తిని క్రమంగా పెంచి.. అందరికీ అందుబాటులోకి తేనున్నారు.

భారత్‌లోనూ పలు వ్యాక్సిన్‌లు ట్రయల్ దశలో ఉన్నాయి. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ (Covaxin), జైడుస్ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్-డీ (Zycov-d) వాక్సిన్‌లు రెండో దశ ట్రయల్స్ దశలో ఉన్నాయి. హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇక ఆక్స్‌పర్డ్-ఆస్ట్రాజెనికా వాక్సిన్‌పై పుణెకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఒప్పందం చేసుకుంది. ఆ వాక్సిన్ ట్రయల్స్‌తో పాటు ఉత్పత్తికి వీటి మధ్య అంగీకారం కుదిరింది. ఒకవేళ ఆక్స్‌పర్డ్ వాక్సిన్ మార్కెట్లోకి వస్తే వాటిని భారత్‌లో సీరం ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తుంది.


ఇక అమెరికాలో ఇప్పటి వరకు 62,90,737 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనాను జయించి 35,47,032 మంది కోలుకున్నారు. అమెరికాలో ఇప్పటి వరకు 1,89,964 మంది మరణించారు. ప్రస్తుతం అమెరికాలో 25,53,741 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో 15,101 మంది పరిస్థితి విషమంగా ఉంది.
Published by: Shiva Kumar Addula
First published: September 3, 2020, 12:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading