కరోనా వ్యాక్సీన్ పంపిణీకి ప్రభుత్వం ఏర్పా్లు చేస్తోంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌పై డ్రైరన్ నిర్వహిస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి రానుంది. అది కూడా ఉచితంగానే పంపిణీ చేస్తామని కేంద్రం ప్రకటిచింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న కరోనా వ్యాక్సీన్‌పై తమకు నమ్మకం లేదని.. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేరొక వ్యాక్సీన్ తెస్తామని అన్నారు. అప్పుడు అందరికీ ఉచితంగానే నాణ్యమైన వ్యాక్సీన్ అందజేస్తామని తెలిపారు.
''ప్రస్తుతానికైతే నేను వ్యాక్సీన్ వేసుకోను. బీజేపీ వ్యాక్సీన్‌ను ఎలా నమ్మాలి. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సీన్ పంపిణీ చేస్తాం. బీజేపీ వ్యాక్సీన్‌ను మాత్రం తీసుకోం.'' అని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. అఖిలేష్ చేసిన ఈ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగుతోంది. వ్యాక్సీన్ విషయంలోనూ రాజకీయాలు చేయడమేంటని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
కాగా, కోవిడ్–19పై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ–ఆ స్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కు జైకొట్టింది. అత్యవసర వినియోగానికి సంబంధించి కోవిషీల్డ్‌కు అనుమతులు మంజూరు చేయడానికి శుక్రవారం సిఫారసు చేసింది. 18 ఏళ్లు దాటిన వారికి 4– 6 వారాల మధ్యలో రెండు డోసుల్లో వ్యాక్సిన్ ఇచ్చేలా సూచించినట్లు అధికారులు తెలిపారు. ఇక ఇప్పటికే వ్యాక్సీనేషన్‌పై దేశవ్యాప్తంగా డ్రైరన్ నిర్వహిస్తున్నారు. వ్యాక్సీనేషన్‌కు సన్నద్ధత, అమలును పరీక్షించేందుకు ఈ డ్రైరన్ చేపట్టారు. డ్రైరన్‌లో ఎదురయ్యే సమస్యలను గుర్తించి.. వ్యాక్సినేషన్ సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోనున్నారు.
కోవిషీల్డ్ వ్యాక్సీన్‌ను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా కంపెనీ అభివృద్ధి చేశాయి. ఆ వ్యాక్సీన్‌ను భారత్‌లో తయారు చేసేందుకు ఆ కంపెనీలతో పుణెకు చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే పెద్ద మొత్తంలో వ్యాక్సీన్లను తయారు చేస్తోంది. శుక్రవారం జరిగిన నిపుణుల కమిటీ సమావేశంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధులతో పాటు కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. తమ వ్యాక్సిన్ల గురించి సంపూర్ణ సమాచారాన్ని అందించారు. అన్నింటినీ సమీక్షించిన అనంతరం మొదట కోవిషీల్డ్ వ్యాక్సీన్ వినియోగానికే నిపుణుల కమిటీ సిషారసు చేసింది. దీనిపై DCGI ఎలాటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Published by:Shiva Kumar Addula
First published:January 02, 2021, 15:41 IST