హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Covaxin: హైదరాబాద్ నుంచి ఢిల్లీ చేరిన కొవాగ్జిన్ టీకాలు.. వ్యాక్సినేషన్‌కు అంతా సిద్ధం

Covaxin: హైదరాబాద్ నుంచి ఢిల్లీ చేరిన కొవాగ్జిన్ టీకాలు.. వ్యాక్సినేషన్‌కు అంతా సిద్ధం

ఢిల్లీ చేరిన కొవాగ్జిన్ టీకాలు

ఢిల్లీ చేరిన కొవాగ్జిన్ టీకాలు

Covaxin: భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌‌ను 55లక్షల డోసుల మేర కేంద్రం కొనుగోలు చేస్తోంది. వీటిలో 38.5లక్షల డోసుల వ్యాక్సిన్‌కు ప్రతి డోసుకు రూ.295 ధర చెల్లించనుంది. మరో 16.5 లక్షల డోసులను మాత్రం భారత్‌ బయోటెక్‌ ఉచితంగానే అందిస్తోంది.

ఇంకా చదవండి ...

  దేశవ్యాప్తంగా కరోనా టీకాల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొదట కోవిషీల్డ్ టీకాలు ఇప్పటికే చేరుకోగా.. ప్రస్తుతం కొవాగ్జిన్ టీకాలను అన్ని ప్రాంతాలకు చేర్చుతున్నారు. హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ కంపెనీ నుంచి కొవాగ్జిన్ టీకాల తొలి బ్యాచ్ బుధవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నాయి. అక్కడి నుంచి మూడు బాక్స్‌లను వాటిని హర్యానాలోని కురుక్షేత్రకు తరలించారు. హైదరాబాద్ నుంచి మిగతా ప్రాంతాలకు కూడా కోవాగ్జిన్ వ్యాక్సిన్‌లను తరలిస్తున్నారు. 16 నుంచి వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వాలు ఏర్పాట్లలో మునిగిపోయాయి.


  కాగా, మన దేశంలో SII తయారుచేసిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ తయారుచేసిన కోవాగ్జిన్ వాక్సిన్‌లకు డీసీజీఐ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రెండు సంస్థల నుంచి టీకాలను కేంద్రం కొనుగోలు చేస్తోంది. తొలిదశ వ్యాక్సినేషన్ కోసం..కోవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్‌లకు ఇప్పటికే ఆర్డర్ ఇచ్చింది. సీరం ఇన్‌స్టిట్యూట్‌ నుంచి 1.10 కోట్ల కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోసులను సేకరిస్తోంది. ఒక్కో డోసు ధర రూ.200 గా ఉన్నట్లు వెల్లడించింది. అటు భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌‌ను 55లక్షల డోసుల మేర కేంద్రం కొనుగోలు చేస్తోంది. వీటిలో 38.5లక్షల డోసుల వ్యాక్సిన్‌కు ప్రతి డోసుకు రూ.295 ధర చెల్లించనుంది. మరో 16.5 లక్షల డోసులను మాత్రం భారత్‌ బయోటెక్‌ ఉచితంగానే అందిస్తోంది.అంతే కొన్ని టీకాలను ఉచితంగా ఇవ్వాలని ఇరు కంపెనీలకు కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది.

  భారత్‌లో జనవరి 16 నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం కానుంది. తొలి దశలో 3 కోట్ల మంది ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు టీకా వేయనున్నారు. ఆ ఖర్చును మొత్తం కేంద్రమే భరిస్తుంది. పీఎం కేర్స్ నుంచి అందుకోసం నిధులను కేటాయించినట్లు తెలిసింది. రెండో దశలో 50 ఏళ్ల పైబడిన వారికి, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి టీకా వేయనున్నారు. ఆ తర్వాతే ఇతరులకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది. దాదాపు సంవత్సరం పాటు ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగనుంది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Corona Vaccine, Coronavirus, Covaxin, COVID-19 vaccine

  ఉత్తమ కథలు