• HOME
  • »
  • NEWS
  • »
  • CORONAVIRUS-LATEST-NEWS
  • »
  • CORONAVIRUS VACCINATION SECOND PHASE PEOPLE AGED BETWEEN 45 AND 59 YEARS WITH 20 COMORBIDITIES ARE ELIGIBLE TO GET COVID 19 VACCINE CHECK LIST HERE SS

COVID 19 Vaccine: ఈ 20 రకాల వ్యాధులు ఉన్నాయా? కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చు

COVID 19 Vaccine: ఈ 20 రకాల వ్యాధులు ఉన్నాయా? కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చు

COVID 19 Vaccine: ఈ 20 రకాల వ్యాధులు ఉన్నాయా? కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చు (ప్రతీకాత్మక చిత్రం)

COVID 19 Vaccine | కరోనా వ్యాక్సినేషన్ రెండో దశలో 45 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వారికి ఈ 20 రకాల రోగాలు, జబ్బులు ఉంటే వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఆ జాబితా ఇక్కడ చూడండి.

  • Share this:
    భారతదేశంలో రెండో దశ కరోనా వైరస్ వ్యాక్సినేషన్ మొదలైంది. రెండో దశలో 60 ఏళ్లు పైబడినవారు, ఇతర రోగాలు ఉన్న 45 నుంచి 59 ఏళ్ల వయస్సువారు కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. వ్యాక్సిన్ తీసుకోవడానికి https://www.cowin.gov.in/ వెబ్‌సైట్‌లోనే రిజిస్టర్ చేసుకోవాలి. ఎలా రిజిస్టర్ చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక వయస్సు 60 ఏళ్లు దాటితే వ్యాధులు ఉన్నా, లేకపోయినా వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులు. కానీ వయస్సు 45 నుంచి 59 ఏళ్ల మధ్య ఉంటే వారికి జబ్బులు ఉంటేనే కరోనా వ్యాక్సిన్ ఇవ్వనుంది కేంద్ర ప్రభుత్వం. ఇందుకోసం 20 రకాల వ్యాధులతో ఓ జాబితా రూపొందించింది. ఆ 20 రకాల వ్యాధులు ఉంటేనే 45 నుంచి 59 ఏళ్ల వయస్సు వారు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. మరి ఆ 20 రకాల రోగాలు ఏవో తెలుసుకోండి.

    Gas Cylinder Price Hike: జనానికి వరుస షాకులు... లాక్‌డౌన్ తర్వాత 8 సార్లు పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర

    Gold: మార్కెట్ రేటు కన్నా తక్కువకే బంగారం... నేటి నుంచి అమ్మకాలు

    COVID 19 Vaccine Registration: ఈ 20 రోగాలు ఉంటే 45 నుంచి 59 ఏళ్ల వారికి వ్యాక్సిన్


    1. హార్ట్ ఫెయిల్యూర్ కారణంగా గత ఏడాదిలో ఆస్పత్రిలో చేరినవారికి.
    2. పోస్ట్ కార్డియాక్ ట్రాన్స్‌ప్లాంట్ లేదా లెఫ్ట్ వెంట్రిక్యులర్ అసిస్ట్ డివైస్ (LVAD).
    3. ఎడమ వెంట్రిక్యులర్ సిస్టోలిక్ పనిచేయకపోవడం (LVEF <40 శాతం).
    4. మితమైన లేదా తీవ్రమైన వాల్యులర్ గుండె జబ్బులు.
    5. తీవ్రమైన PAH లేదా ఇడియోపతిక్ PAH తో పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు.
    6. CABG, PTCA, MI లేదా హైపర్‌టెన్షన్, డయాబెటిస్‌తో కొరోనరీ ఆర్టరీ వ్యాధి ఉన్నవాళ్లు
    7. ఆంజినా, రక్తపోటు లేదా డయాబెటిస్ చికిత్స.
    8. CT లేదా MRI డాక్యుమెంట్ చేసిన స్ట్రోక్, రక్తపోటు, మధుమేహం.
    9. పల్మనరీ ఆర్టరీ హైపర్‌టెన్షన్, హైపర్‌టెన్షన్ లేదా డయాబెటిస్.
    10. పదేళ్ల కన్నా ఎక్కువగా డయాబెటిస్ లేదా ఇతర ఆరోగ్య సమస్యలు, రక్తపోటుతో చికిత్స తీసుకుంటున్నవాళ్లు.
    11. కిడ్నీ లేదా లివర్ లేదా హెమటోపోయిటిక్ స్టెమ్ సెల్ మార్పిడి చేసుకున్నవారు లేదా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నవాళ్లు.
    12. హిమోడయాలసిస్, సిఎపిడితో చివరి దశ మూత్రపిండాల వ్యాధితో ఉన్నవాళ్లు
    13. ఓరల్ కార్టికోస్టెరాయిడ్స్ లేదా రోగనిరోధక మందులను దీర్ఘకాలంగా ఉపయోగిస్తున్నవాళ్లు.
    14. క్షీణించిన సిర్రోసిస్.
    15. తీవ్రమైన శ్వాసకోశ వ్యాధితో గత రెండేళ్లలో ఆసుపత్రిలో చేరిన వాళ్లు లేదా FEVI <50 శాతం ఉన్నవాళ్లు.
    16. లింఫోమా లేదా లుకేమియా లేదా మైలోమా
    17. 2020 జూలై 1 తర్వాత క్యాన్సర్ నిర్ధారణ అయినవాళ్లు లేదా ప్రస్తుతం ఏదైనా క్యాన్సర్ చికిత్సలో ఉన్నవాళ్లు.
    18. సికిల్ సెల్ డిసీజ్ లేదా బోన్ మ్యారో ఫెయిల్యూర్ లేదా అప్లాస్టిక్ అనీమియా లేదా తలసేమియా మేజర్
    19. ప్రాథమిక రోగనిరోధక శక్తి వ్యాధులు / హెచ్ఐవి ఇన్ఫెక్షన్
    20. మేధో వైకల్యం కారణంగా వైకల్యాలున్న వ్యక్తులు లేదా మస్క్యులర్ డిస్ట్రోఫీ లేదా యాసిడ్ దాడి కారణంగా శ్వాసకోశవ్యవస్థ దెబ్బతిన్నవాళ్లు లేదా ఇతరుల సాయం కావాల్సిన దివ్యాంగులు లేదా చెవిటి-అంధత్వంతో సహా పలు వైకల్యాలు ఉన్నవారు.
    Published by:Santhosh Kumar S
    First published: