• HOME
  • »
  • NEWS
  • »
  • CORONAVIRUS-LATEST-NEWS
  • »
  • CORONAVIRUS VACCINATION SECOND PHASE BEGINS TODAY KNOW HOW TO REGISTER FOR COVID 19 VACCINE ON CO WIN PORTAL OR WEBSITE SS

COVID 19 Vaccine Registration: కరోనా వ్యాక్సిన్ కోసం Co-WIN వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోండి ఇలా

COVID 19 Vaccine Registration: కరోనా వ్యాక్సిన్ కోసం Co-WIN వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోండి ఇలా

COVID 19 Vaccine Registration: కరోనా వ్యాక్సిన్ కోసం Co-WIN వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

COVID 19 Vaccine Registration | కరోనా వ్యాక్సిన్ కోసం కోవిన్ యాప్‌లో రిజిస్టర్ చేయాలనుకుంటున్నారా? కోవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ ఉండదు. కోవిన్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేయాలి. ఈ స్టెప్స్ ఫాలో అవండి.

  • Share this:
    దేశవ్యాప్తంగా రెండో దశ కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. 60 ఏళ్లు పైబడినవారికి, ఇతర రోగాలు ఉన్న 45 నుంచి 59 ఏళ్ల వయస్సువారికి వ్యాక్సిన్ ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. వ్యాక్సిన్ తీసుకోవాలనుకునేవారు Co-WIN ప్లాట్‌ఫామ్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. Co-WIN 2.0 వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు. వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం గూగుల్ ప్లేస్టోర్‌లో లేదా ఆన్‌లైన్‌లో Co-WIN App లేదన్న సంగతి గుర్తుంచుకోవాలి. ప్లేస్టోర్‌లో కనిపించే Co-WIN App కేవలం అధికారుల కోసం మాత్రమే. వ్యాక్సిన్ తీసుకోవాలనుకునేవారికి కాదు. వ్యాక్సిన్ తీసుకోవాలనుకునేవారు కేవలం https://www.cowin.gov.in/ వెబ్‌సైట్‌లోనే వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకోవాలి. వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం ఎవరైనా ఫోన్ చేసినా, మీ వివరాలు అడిగినా చెప్పాల్సిన అవసరం లేదు. https://www.cowin.gov.in/ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకుంటే చాలు. ఈ వెబ్‌సైట్ తప్ప మరే వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉండదు. నకిలీ వెబ్‌సైట్స్‌లోకి వెళ్లి మీ వివరాలు ఇచ్చి మోసపోవద్దు. వ్యాక్సిన్ తీసుకోవాలనుకునే టైమ్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఒకరు గరిష్టంగా ముగ్గురి పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయొచ్చు. మొదటి డోస్, రెండో డోస్‌కు స్లాట్స్ బుక్ చేయొచ్చు.

    దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యాక్సిన కేంద్రాలతో పాటు 10,000 పైగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగానే వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఇతర ఆస్పత్రుల్లో ఒక డోసుకు రూ.250 చెల్లించాలి. రెండో దశ వ్యాక్సినేషన్ డ్రైవ్ ఆరు వారాలపాటు కొనసాగుతుంది. మరి Co-WIN ప్లాట్‌ఫామ్‌లో ఎలా రిజిస్టర్ చేయాలో తెలుసుకోండి.


    Gas Cylinder Price Hike: జనానికి వరుస షాకులు... లాక్‌డౌన్ తర్వాత 8 సార్లు పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర

    Gold: మార్కెట్ రేటు కన్నా తక్కువకే బంగారం... నేటి నుంచి అమ్మకాలు

    COVID 19 Vaccine Registration: కోవిడ్ 19 వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేయండి ఇలా


    ముందుగా కోవిన్ https://www.cowin.gov.in/ ఓపెన్ చేయండి.
    మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి.
    మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
    ఓటీపీ ఎంటర్ చేసి Verify పైన క్లిక్ చేయండి.
    ఆ తర్వాత వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది.
    ఆ తర్వాత ఏదైనా ఒక ఐడీ ప్రూఫ్ ఎంటర్ చేయండి.
    పేరు, వయస్సు, పుట్టిన తేదీ ఎంటర్ చేసి ఏదైనా ఐడీ డాక్యుమెంట్ అప్‌లోడ్ చేయండి.
    ఏవైనా ఇతర రోగాలు, వ్యాధులు ఉన్నాయా అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వండి.
    45 ఏళ్లు దాటినవారైతే ఇతర రోగాలు ఉన్నట్టు డాక్టర్ సర్టిఫికెట్ తప్పనిసరి.
    ఆ తర్వాత రిజిస్ట్రేషన్ బటన్ పైన క్లిక్ చేయాలి.
    ఆ తర్వాత వివరాలు కనిపిస్తాయి.
    ఒకే మొబైల్ నెంబర్‌తో ఇతరుల పేర్లు యాడ్ చేయొచ్చు.
    రిజస్ట్రేషన్ తర్వాత అపాయింట్‌మెంట్ పైన క్లిక్ చేయండి.
    రాష్ట్రం, జిల్లా, బ్లాక్, పిన్ కోడ్ లాంటివి సెలెక్ట్ చేయాలి.
    తేదీ సరిచూసుకున్న తర్వాత book పైన క్లిక్ చేయాలి.
    రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత వ్యాక్సినేషన్ అపాయింట్‌మెంట్‌తో మెసేజ్ వస్తుంది.

    SBI: మీకు ఎస్‌బీఐ అకౌంట్ ఉందా? బ్యాంకుకు వెళ్లకుండానే ఈ సర్వీస్ పొందొచ్చు

    Aadhaar Card: ఆధార్ కార్డు లేకపోయినా మీ ఆధార్ నెంబర్ 3 నిమిషాల్లో తెలుసుకోండి ఇలా

    COVID 19 Vaccine Registration: వ్యాక్సినేషన్ సెంటర్‌కు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఇవే...


    ఓటర్ ఐడీ కార్డ్
    పాన్ కార్డ్
    పాస్‌పోర్ట్
    డ్రైవింగ్ లైసెన్స్
    ఎన్‌పీఆ స్మార్ట్ కార్డ్
    ఫోటో ఉన్న పెన్షన్ డాక్యుమెంట్
    డాక్టర్ సర్టిఫికెట్ (45 నుంచి 59 ఏళ్ల లోపువారికి)

    కోవిన్ వెబ్‌సైట్ https://www.cowin.gov.in/ వెబ్‌సైట్‌లో కరోనా వైరస్ వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేయొచ్చు. మీరు ఎందులో రిజిస్ట్రేషన్ చేసినా పైన చెప్పినట్టుగానే ప్రాసెస్ ఉంటుంది. ఒకసారి స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీ అపాయింట్‌మెంట్ డేట్ మార్చుకోవచ్చు. ఒకవేళ మొదటి డోస్‌కు అపాయింట్‌మెంట్ క్యాన్సిల్ చేస్తే ఆటోమెటిక్‌గా రెండో డోస్ అపాయింట్‌మెంట్ కూడా క్యాన్సిల్ అవుతుంది. మీరు డోసు తీసుకున్న తర్వాత ఆరోగ్య సేతు, డిజీ లాకర్, కోవిన్ వెబ్‌సైట్‌లో వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఉంటుంది. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు