వారికి మాత్రమే హైడ్రాక్విక్లోరోక్విన్ ఇవ్వాలి.. కేంద్ర ఆరోగ్యశాఖ క్లారిటీ

భారత్‌లో ఇప్పటి వరకు 767,296 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 476,378 మంది కరోనాతో పోరాడి కోలుకున్నారు.

news18-telugu
Updated: July 10, 2020, 9:28 AM IST
వారికి మాత్రమే హైడ్రాక్విక్లోరోక్విన్ ఇవ్వాలి.. కేంద్ర ఆరోగ్యశాఖ క్లారిటీ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్‌కు ఇప్పటి వరకు మందు లేదు. ఐతే రెమడిసివిర్, ఫావిపిరవిర్, హైడ్రాక్సిక్లోరోక్విన్, డెక్సా మెథాసోన్ వంటి మందులతో కొంత సత్ఫలితాలు వస్తున్నాయి. భారత్‌లో హైడ్రాక్సీక్లోరోక్విన్ ముందును పేషెంట్లకు ఇస్తున్నారు. ఐతే ఈ డ్రగ్‌పై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మరింత స్పష్టత ఇచ్చింది. కరోనా తీవ్ర తక్కువగా, సాధారణ స్థాయిలో ఉన్న వారికి మాత్రమే HCQని ఇవ్వాలని సూచించింది. విషమ పరిస్థితుల్లో ఉన్న వారికి మాత్రం ఇవ్వకూడదని స్పష్టం చేసింది.

కాగా, భారత్‌లో ఇప్పటి వరకు 767,296 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 476,378 మంది కరోనాతో పోరాడి కోలుకున్నారు. ఇప్పటికే ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. కరోనా బారినపడి మనదేశంలో ఇప్పటి వరకు 21,129 మంది మరణించారు. ప్రస్తుతం మనదేశంలో 269,789 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

Published by: Shiva Kumar Addula
First published: July 10, 2020, 9:24 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading