కరోనాతో అమెరికా అస్తవ్యస్తం... చైనా, ఇటలీ తర్వాత ఇక్కడే అత్యధికం

ప్రపంచవ్యాప్తంగా 192 దేశాలకు కరోనా వైరస్ విస్తరించింది. ఇప్పటి వరకు 341,526 కరోనా కేసులు నమోదు కాగా.. 14,748 మరణాలు సంభవించాయి.

news18-telugu
Updated: March 23, 2020, 2:27 PM IST
కరోనాతో అమెరికా అస్తవ్యస్తం... చైనా, ఇటలీ తర్వాత ఇక్కడే అత్యధికం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అమెరికాపై కోవిడ్-19 మహమ్మారి పంజా విసురుతోంది. ప్రతి రోజూ వేయికి పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. చైనా, ఇటలీ తర్వాత ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదైన దేశం అమెరికానే. చైనాలో 81,093, ఇటలీలో 59,138 కేసులు నమోదవగా.. సోమవారం ఉదయం నాటికి యూఎస్‌లో 35,070 కేసులు నమోదయ్యాయి. ఇందులో సగానికి పైగా కేసులు ఒక్క న్యూయార్క్ స్టేట్‌లోనే రికార్డయ్యాయి. ఈ క్రమంలో అమెరికా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే కాలిఫోర్నియా, ఇల్లినాయిస్, న్యూయార్క్, న్యూజెర్సీ, ఓహియో, లూసియానా, కనెక్టికట్‌ రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు విధించారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. కరోనా దెబ్బకు పలు రాష్ట్రాల్లో అన్ని వ్యవస్థలూ స్తంభించిపోయాయి. అమెరికాలో కరోనా ప్రభావంతో ఇప్పటి వరకు 458 మంది చనిపోయారు.


ఇక ప్రపంచవ్యాప్తంగా 192 దేశాలకు కరోనా వైరస్ విస్తరించింది. ఇప్పటి వరకు 341,526 కరోనా కేసులు నమోదు కాగా.. 14,748 మరణాలు సంభవించాయి. ఇటలీలో 5,476 మంది చనిపోయారు. చైనాలో 3,270, స్పెయిన్‌లో 1,813, ఇరాన్‌లో 1,685, ఫ్రాన్స్‌లో 674, అమెరికాలో 458 మంది చనిపోయారు. కరోనా మరణాల్లో అమెరికా మూడో స్థానంలో ఉన్నప్పటికీ.. మిగతా దేశాలతో పోల్చితే మరణాల సంఖ్య మాత్రం కొంత తక్కువగానే ఉంది. ఐతే రోజురోజుకూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండడంతో మరిన్ని కఠిన ఆంక్షలు విధించే ట్రంప్ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా లెక్కలు (worldometers)


First published: March 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading