Oxygen Cylinder: రూపాయికే ఆక్సిజన్ సిలిండర్.. కరోనా కష్ట సమయంలో నిజంగా దేవుడే..

ప్రతీకాత్మక చిత్రం

కరోనా కష్ట సమయంలోనూ కొంత మంది సమాజ సేవ చేస్తున్నారు. కోవిడ్ రోగుల కోసం తమ వంతు సాయం చేస్తున్నారు. ఉత్తప్రదేశ్‌కు చెందిన ఓ వ్యాపార వేత్త రూపాయికే సిలింగర్ అందజేస్తున్నారు.

 • Share this:
  ఆక్సిజన్ కొరతతో యావత్ దేశం అల్లాడుతోంది. ప్రాణ వాయువు లేక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆక్సిజన్ కొరత లేకుండా ఉండేందుకు కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. రైళ్లు, యుద్ధ విమానాల్లో ఆక్సిజన్ ట్యాంకర్లను సరఫరా చేయడంతో పాటు ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను తరలిస్తున్నారు. ప్రస్తుతం కష్ట కాలంలో చాలా మంది ఆక్సిజన్‌ను బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారు. ఒక్క సిలిండర్‌ను రూ.40వేలకు అమ్ముతున్నారు. ఇలాంటి కష్ట సమయంలోనూ కొంత మంది సమాజ సేవ చేస్తున్నారు. కోవిడ్ రోగుల కోసం తమ వంతు సాయం చేస్తున్నారు. ఉత్తప్రదేశ్‌కు చెందిన ఓ వ్యాపార వేత్త రూపాయికే సిలింగర్ అందజేస్తున్నారు.

  ఉత్తరప్రదేశ్‌లోని హమీన్‌పూర్‌కు చెందిన వ్యాపారవేత్త మనోజ్ గుప్తా కరోనా టైమ్‌లో రియల్ హీరోగా మారాడు. ఈయన గత ఏడాది కరోనా బారినపడ్డారు. అప్పుడు శ్వాస తీసుకోక చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు చాలా మంది అదే బాధలు పడుతున్నారు. వారిని చూసి ఎంతో చలించిపోయారు మనోజ్ గుప్తా. తాను పడిన కష్టం మరెవరూ పడకూడదని కోవిడ్ రోగులకు అండగా ఉన్నారు. తమ కంపెనీలో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్‌ను రూపాయికే అందిస్తున్నారు. మనోజ్ గుప్తా ఫ్యాక్టరీలో రోజుకు 1000 సిలిండర్లను రీఫిల్లింగ్ చేసే సామర్థ్యం ఉంది. అలా ఉత్పత్తి చేసిన ఆక్సిజన్‌ను.. ఒక్కో సిలిండర్‌ను కేవలం రూపాయికే నింపి అందిస్తున్నారు. తాను ఉచితంగానే ఆక్సిజన్ సిలిండర్ రీఫిల్ చేయాలని అనుకున్నాని.. కానీ ఉత్పత్తులకు బిల్లింగ్ చేయాల్సిన అవసరం ఉండటంతో కనీస చార్జీగా రూపాయి తీసుకుంటున్నట్లు తెలిపారు.


  ఈ ఫ్యాక్టరీ గురించి చుట్టుపక్కల వారికి తెలిసి పెద్ద మొత్తంలో జనాలు తరలి వస్తున్నారు. లక్నో, ఝాన్సీ, బందా, అలీగఢ్‌, లలిత్‌పూర్‌, కాన్పూర్ వంటి ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు ప్లాంట్‌కు వస్తున్నారని మనోజ్ గుప్తా తెలిపారు. మనోజ్ గుప్తా సేవలపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి విప్కతర సమయంలో మీలాంటి వారు ఉండాలి.. సార్ అంటూ కామెంట్ చేస్తున్నారు. మీరు నిజంగా దేవుడని మెచ్చుకుంటున్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published: