Corona Vaccine: శుభవార్త చెప్పిన కేంద్రం.. మార్చి1 నుంచి వారందరికీ ఉచితంగా కరోనా టీకా

Corona Vaccine: శుభవార్త చెప్పిన కేంద్రం.. మార్చి1 నుంచి వారందరికీ ఉచితంగా కరోనా టీకా

ప్రతీకాత్మక చిత్రం

corona vaccine: మొత్తం 10వేల ప్రభుత్వ వ్యాక్సినేషన కేంద్రాలు, 20వేల ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో వ్యాక్సిన్ ఇస్తామని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఐతే ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఉచితంగానే టీకాలు వేస్తారని ఆయన వెల్లడించారు.

  • Share this:
    దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటికే వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు వంటి ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఉచితంగా టీకాలు వేసిన కేంద్రం.. మార్చి 1 నుంచి సామాన్య ప్రజలకు కూడా టీకా వేయనున్నట్లు ప్రకటించింది. 60 ఏళ్లు పైబడిన వారితో పాటు 45 ఏళ్లు పైబడి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి మార్చి 1 నుంచి టీకాలు వేస్తామని తెలిపింది. మొత్తం 10వేల ప్రభుత్వ వ్యాక్సినేషన కేంద్రాలు, 20వేల ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో వ్యాక్సిన్ ఇస్తామని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఐతే ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఉచితంగానే టీకాలు వేస్తారని ఆయన వెల్లడించారు.

    మన దేశంలో ప్రస్తుతం చాలా మంది మాస్క్‌లు ధరించడం లేదు. భౌతిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కరోనా కొత్త మ్యుటెంట్స్ కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. భారత్‌లో ప్రస్తుతం ఉన్న యాక్టివ్ కేసుల్లో 75 శాతం కేవలం మహారాష్ట్ర, కేరళలోనే ఉన్నాయని కేంద్రం తెలిపింది. ఈ రెండు రాష్ట్రాల్లో N440K, E484Q కరోనా వేరియంట్లు ఉన్నట్లు వెల్లడించింది. మన దేశంలో ఇప్పటి వరకు 187 మందికి యూకే రకం కరోనా సోకిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.

    తాజాగా ఇండియాలో కొత్త కేసులు 13,742 వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 1.10 కోట్లు దాటింది. నిన్న కొత్తగా 104 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 1,56,567కి చేరింది. మరణాల రేటు దేశంలో 1.4 శాతంగా ఉంది. నిన్న 14,037 మంది కరోనా నుంచి రకవరీ అయ్యారు. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 1.07 కోట్లు దాటింది. రికవరీ రేటు దేశంలో 97.2 శాతంగా ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,46,907గా ఉన్నాయి. దేశంలో నిన్న 8,05,844 టెస్టులు చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య 21.30 కోట్లు దాటింది
    Published by:Shiva Kumar Addula
    First published: