ఏపీ వెళ్లేవారికి గుడ్ న్యూస్... ఇకపై అక్కడ ఆ టెన్షన్లు ఉండవు...

Coronavirus updates : కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్-3 ప్రారంభించేసింది కాబట్టి... ఏపీ ప్రభుత్వం కూడా దాని ప్రకారం... తన రూల్స్ మార్చుకుంటోంది.

news18-telugu
Updated: August 1, 2020, 10:29 AM IST
ఏపీ వెళ్లేవారికి గుడ్ న్యూస్... ఇకపై అక్కడ ఆ టెన్షన్లు ఉండవు...
ఏపీ వెళ్లేవారికి గుడ్ న్యూస్... ఇకపై అక్కడ ఆ టెన్షన్లు ఉండవు...
  • Share this:
Coronavirus updates : ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రోజూ 10వేల దాకా కరోనా పాజిటివ్ కేసులొస్తున్నాయి. అయినప్పటికీ... ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది ఏపీకి వెళ్తున్నారు. అందుకు రకరకాల కారణాలు ఉండొచ్చు. ఐతే... కేంద్ర హోంశాఖ... ఆగస్ట్ 1 నుంచి అన్‌లాక్ 3 ప్రారంభించడంతో... రాష్ట్రాల మధ్య ప్రయాణాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కఠిన కండీషన్లను కాస్త తేలిక చేస్తోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వెళ్లేవారు... జస్ట్ స్పందన వెబ్‌సైట్‌ (Spandana website)లో తమ వివరాల్ని రిజిస్టర్ చేసుకుంటే చాలు. ఈ-పాస్ అనేది ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతుంది. అది వారి మొబైల్, ఈమెయిల్‌కి వచ్చేస్తుంది.

తమ మొబైల్‌ లేదా ఈమెయిల్‌కి వచ్చిన ఈ పాస్‌తోపాటూ... ఏపీకి వెళ్లేవారు సరైన ఐడీ ప్రూఫ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఏపీ సరిహద్దు దగ్గర పోలీసులు ఆపి... ఈపాస్, ఐడీ చూపించండి అనగానే... సోషల్ డిస్టాన్స్ పాటిస్తూ... అవి చూపిస్తే చాలు... ఓకే అంటూ లోపలికి అనుమతిస్తారు.

ఇదివరకు ఈ-పాస్ రావడానికి టైమ్ పట్టేది. ఇప్పుడు అలా కాదు. వెంటనే వచ్చేస్తుంది. కాబట్టి... ఏపీకి వెళ్లాలనుకునేవారికి ఈ తలనొప్పి లేనట్లే. ఇక ఏపీలోకి వెళ్లాక.... హెల్త్ చెకప్స్ ఉంటాయి. అక్కడి హెల్త్ స్టాఫ్... ఆరోగ్యం ఎలా ఉందో చెక్ చేస్తారు. మొత్తంగా ఆగస్ట్ 2 నుంచి ఇలా ఆటోమేటిక్ ఈ-పాస్ లభించనుందని ఏపీ కొవిడ్ కంట్రోల్ రూమ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ కృష్ణబాబు తెలిపారు. అందువల్ల ఏపీకి వెళ్లాలనుకునేవారు... వేవంగా ఈపాస్ ఏర్పాటు చేసుకొని వెళ్లవచ్చని వివరించారు.
Published by: Krishna Kumar N
First published: August 1, 2020, 10:29 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading