కరోనాపై యుద్ధానికి రూ.150 లక్షల కోట్లతో ట్రంప్ సిద్ధం...

వైట్ హౌస్ , రెండు పార్టీల లీడర్లు కలిసి మార్చి 25వ తేదీన ఎమర్జెన్సీ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ వైరస్ కట్టడితో పాటు దీని బారిన పడిన వివిధ రంగాలను అడ్డుకునేందుకు ఏకంగా రెండు ట్రిలియన్ డాలర్ల రెస్క్యూ బిల్లుకు ఆమోదం తెలిపారు.

news18-telugu
Updated: March 26, 2020, 7:08 AM IST
కరోనాపై యుద్ధానికి రూ.150 లక్షల కోట్లతో ట్రంప్ సిద్ధం...
డొనాల్డ్ ట్రంప్
  • Share this:
కరోనా అమెరికాను కార్చిచ్చులా కాల్చేస్తోంది. దీంతో కరోనా మహమ్మారిని ఎలాగైనా అడ్డుకునేందుకు అమెరికా ప్రభుత్వం భారీ ప్యాకేజీని ప్రకటించింది. వైట్ హౌస్ , రెండు పార్టీల లీడర్లు కలిసి మార్చి 25వ తేదీన ఎమర్జెన్సీ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ వైరస్ కట్టడితో పాటు దీని బారిన పడిన వివిధ రంగాలను అడ్డుకునేందుకు ఏకంగా రెండు ట్రిలియన్ డాలర్ల రెస్క్యూ బిల్లుకు ఆమోదం తెలిపారు. అంటే మన కరెన్సీలో ఏకంగా రూ.150 లక్షల కోట్లను అమెరికా ప్రభుత్వం సిద్ధం చేసుకుంది. గతంలో ఎప్పుడూ లేనంత ఈ రెస్క్యూ ప్యాకేజీలో భాగంగా అమెరికన్లలో అధిక శాతం మందికి నేరుగా నగదును ఇవ్వబోతున్నారు. నిరుద్యోగులకు మరిన్ని ప్రయోజనాలను చేకూర్చబోతున్నారు. చిన్న వ్యాపారస్తులను ఆదుకునేందుకు ఏఖంగా 367 బిలియన్ డాలర్లను కేటాయించారు (రూ.2752000 కోట్లు). ఉద్యోగులు ఇంటికే పరిమితైనా వాళ్లందరికీ జీతాలను ఇచ్చేందుకు ఈ నిధులను ఉపయోగిస్తారు.

ఇక 500 బిలియన్ డాలర్ల మొత్తాన్ని పెద్ద సంస్థల గ్యారెంటీలకు, సబ్సిడీలకు కేటాయించారు (రూ.37,50,000 కోట్లు) సిద్ధం చేశారు. ఎయిర్ లైన్స్‌ సంస్థలను కూడా ఆదుకోబోతున్నారు. ప్రముఖంగా హాస్పిటల్స్‌కు అధిక నిధులు వెచ్చించబోతున్నారు. చరిత్రలో ఎప్పుడూ విననంత ఈ ప్యాకేజీ ద్వారా నేరుగా ప్రతీ మనిషికీ 1200 డాలర్లు, పిల్లలకు 500 డాలర్లు ఇవ్వబోతున్నారు. అంటే మన కరెన్సీలో సుమారు పెద్దలకి రూ.90 వేలు, చిన్న పిల్లలకు రూ.37500 డబ్బు నేరుగా ఏకమొత్తంలో ఒకసారి లభించబోతోంది.

First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు